Elephant Idols : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం నడుచుకుంటే, ఎంతో మంచి జరుగుతుంది. చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు ప్రకారం చాలా మంది ఇంటిని సర్దుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం పొరపాట్లు ఏమీ జరగకుండా, అంతా మంచి జరిగే విధంగా చూసుకుంటూ ఉంటారు. చాలామంది ఇళ్లల్లో, సంపద పెరగడానికి ఏనుగులు బొమ్మలు పెడుతూ ఉంటారు. వ్యాపారం చేసే చోట కూడా ఏనుగు విగ్రహాలు, ఏనుగు ఫోటోలు వంటివి పెడుతూ ఉంటారు. ఇటువంటివి పెట్టడం వలన, అదృష్టం కలిగి, వృద్ధి చెందుతారని, విజయాన్ని అందుకుంటారని నమ్ముతారు.
అయితే, ఇంట్లో, ఆఫీసుల్లో ఏనుగు విగ్రహాలని కానీ ఏనుగు చిత్రపటాలని కానీ ఏ దిక్కులో ఉంచాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎటువైపు ఉంచితే ప్రయోజనం కలుగుతుంది అనేది చూస్తే.. హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే, ఏనుగు చిత్రాలు బలం, గౌరవం, గొప్పతనాన్ని సూచిస్తాయి. ఏనుగుని వినాయకుడితో పోలుస్తారు. వినాయకుడు విఘ్నాలు తొలగించి, జీవితం ఆనందంగా ఉండేటట్టు చూస్తారు. మన ఇంట్లో ఏనుగులు బొమ్మలు, చిత్రపటాలు ఉంటే, అదృష్టం కలిసి వస్తుంది. సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఇంట్లో ఏనుగు విగ్రహాలని పెట్టుకుంటే మంచిది.
వాస్తు ప్రకారం, ఏనుగు బొమ్మని ఉత్తరం లేదా ఈశాన్యం వైపు పెడితే మంచిది. ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ ఉత్తరం లేదా ఈశాన్యం వైపు పెట్టండి. ఉత్తరం, ఈశాన్య దిక్కులు సంపదని, విజయాన్ని సూచిస్తాయి. ఈ దిక్కుల్లో ఏనుగు బొమ్మని పెడితే, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తూర్పు వైపు కూడా ఏనుగు బొమ్మల్ని పెట్టవచ్చు.
ఇంటి ప్రవేశ ద్వారంలో ఏనుగు బొమ్మను పెడితే అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయి. స్టడీ రూమ్ లో లేదంటే ఆఫీసు గదిలో ఏనుగు చిత్రాన్ని ఉంచితే కూడా మంచి ఫలితం ఉంటుంది. లివింగ్ రూమ్ లో హాల్ లో కూడా ఏనుగు బొమ్మల్ని పెట్టుకోవచ్చు. దీనివలన దృష్టి దోషం తొలగిపోతుంది. ఏనుగు చిత్రాలని, బొమ్మలని నేల మీద ఉంచకూడదు. తల ఎత్తి చూసేలా ఏనుగు చిత్రపటాలని పెట్టాలి. ఏనుగు బొమ్మల్ని నేల మీద డైరెక్ట్ గా పెట్టకుండా చూసుకోవాలి.