Beeruva : ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువుల్లో బీరువా ఒకటి. దీనిలో మనం డబ్బును, బంగారాన్ని, దుస్తులను భద్రపరుస్తాం. అయితే ఇంట్లో బీరువాను ఏ దిక్కున ఉంచాలి.. ఎలా ఉంచాలి.. అనే విషయాలపై అందరికీ అవగాహన ఉండదు. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే బీరువాను ఏ దిక్కున ఉంచాలో చాలా మందికి తెలియదు. చాలా మంది బీరువాను ఏ దిక్కున పడితే ఆ దిక్కున పెడుతుంటారు. అసలు ఇంట్లో బీరువాను ఏ దిక్కున ఉంచాలి.. ఎలా ఉంచితే మనం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందగలం.. లక్ష్మీ దేవి ఎప్పుడూ మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఏం చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మనం బీరువాలో ఎంతో విలువైన పత్రాలను, ఆభరణాలను, ధనాన్ని ఉంచుతూ ఉంటాం. ఈ బీరువాను మన ఇంట్లో ఏ దిక్కున పడితే ఆ దిక్కున పెట్టకూడదు. కేవలం నైరుతి మూలన మాత్రమే మనం బీరువాను ఉంచాలి. దక్షిణ దిక్కు, పడమర దిక్కుకు మధ్యలో ఉండే ఆ ప్రదేశాన్ని నైరుతి మూల అంటారు. ఈ మూలన మాత్రమే మనం బీరువాను ఉంచాలి. బీరువా తలుపులు తీస్తే ఈ తలుపులు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. బీరువా తలుపులు తీయగానే చక్కటి సువాసన రావాలి.
దుస్తుల వాసన, దుర్వాసన రాకూడదు. అలాంటి వాసనలు వస్తే మన ఇంట్లో లక్ష్మీ దేవి నివాసం ఉండదు. అలాగే బీరువాపై పసుపు, కుంకుమలతో సవ్య దిశలో ఉన్న స్వస్తిక్ గుర్తును ఉంచాలి. అలాగే బీరువాపై ఏనుగులతో కూడిన లక్ష్మీదేవిఫోటో ఉండాలి. వాటి తొండాలు ఎంత ఎత్తులో ఉంటే అంత మంచిదట. ఈ విధంగా బీరువాను మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందగలమని నిపుణులు చెబుతున్నారు. దీంతో ధనం బాగా సంపాదిస్తారని.. ఆర్థిక సమస్యలు ఉండవని అంటున్నారు.