House Main Door : చాలా మంది వివిధ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. సమస్యలకి పరిష్కారం మనకి వాస్తుతో దొరుకుతుంది. వాస్తు దోషాలకి తాంత్రిక సలహాల గురించి తెలుసుకోవాలని అనుకుంటే తప్పక మీరు ఇది చూడాల్సిందే. వాస్తు దోషాలకు తాంత్రిక సలహాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంట్లో వాస్తు దోషాలు కలిగి మీరు ఉంటున్నట్లయితే సమస్యలు కలుగుతాయి. అటువంటి సమస్యల నుండి విముక్తి పొందాలంటే మరి ఇలా ఆచరించండి.
తూర్పు సింహద్వారం అయ్యి సమస్యల్లో ఉంటే, యజమాని హస్తంతో గుప్పిడి బియ్యాన్ని తీసుకోవాలి. అలానే గుప్పెడు గోధుములని, కొంచెం కర్పూరన్ని తెలుపు వస్త్రంలో మూటగట్టి ఆదివారం రోజు ఉదయం సింహద్వారం పైన వేలాడ కట్టాలి. అప్పుడు మీకు పరిష్కారం దొరుకుతుంది.
పడమర సింహద్వారం వాళ్ళు వాస్తు దోషాలు ఉన్నట్లయితే గుప్పెడుతో బియ్యాన్ని, అంతే బరువుతో ప్రత్తి గింజలు, కర్పూరంని నీలి వస్త్రంతో మూటకట్టి సింహద్వారం పై శనివారం తగిలిస్తే మంచిది. ఎలాంటి సమస్యలైనా కూడా ఇకనుండి పోతాయి. ఉత్తర సింహద్వారం వాళ్ళు యజమాని గుప్పెడులో పైసలు, గుప్పెడు బియ్యం, కర్పూరం ఆకుపచ్చని గుడ్డలో మూట కట్టి, సింహద్వారం పై బుధవారం వేలాడ కడితే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
దక్షిణ సింహద్వారం వారు యజమాని గుప్పెడతో గుప్పెడు కందులు, గుప్పెడు బియ్యం, కర్పూరం ఎర్రని గుడ్డలో మూట కట్టి సింహద్వారం పై మంగళవారం నాడు కడితే అశాంతి తొలగిపోతుంది. సుఖసంతోషాలు ఉంటాయి. చిక్కుల నుండి బయట పడవచ్చు.