vastu

Trees : ఇంటి పరిసరాల్లో ఎలాంటి మొక్కల‌ను పెంచాలి.. ఏ మొక్కలు ఉంటే ధ‌నం, శాంతి ల‌భిస్తాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Trees &colon; సృష్టిలో ప్రాణమున్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం&period; మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం కచ్చితమైన దశ&comma; దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే కలుగుతాయి&period; మనం నివాసం ఉంటున్న ఇంట్లో ఎలాంటి చెట్లుండాలి&period;&period; ఏ చెట్టుంటే శుభం ఫలితం కలుగుతుంది&period;&period; ఉండకూడని చెట్లేవైనా ఉన్నాయా&period;&period; అనే ప్రశ్నలకు బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్థం 103 అధ్యాయంలో కనిపిస్తుంది&period; శ్రీకృష్ణుడు స్వయంగా విశ్వకర్మకు ఈ చెట్ల విశేషాలను వివరించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇళ్ళ ఆవరణల్లో శుభకరమైన చెట్లు&comma; పూలతీగలు&comma; ఫలాలనిచ్చే వృక్షాలు ఉండాలని విశ్వకర్మను కృష్ణుడు హెచ్చరించాడు&period; అప్పుడు విశ్వకర్మ నగర నిర్మాణం జరిగాక గృహాల ఆవరణల్లో ఏ మంచి చెట్లను ఉంచాలో&comma; నగరం లోపల ఉద్యానవనాలలో ఎలాంటి పూలతోటలను&comma; చెట్లను పెంచాలో వివరించమని కోరాడు&period; ఆ సందర్భంగా కృష్ణుడు శుభప్రదమైన మొక్కలు పూల తీగల&comma; చెట్ల విశేషాలను చెప్పాడు&period; గృహస్థులు ఉండే గృహాల ఆవరణలో కొబ్బరి చెట్టు à°§à°¨ ప్రదం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53994 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;trees&period;jpg" alt&equals;"which type of trees you should grow at home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాటిచెట్టు ఎక్కడైనా ఉండొచ్చు&period; మామిడి ఏ దిక్కున ఉన్నా శుభప్రదమే&period; మారేడు&comma; పనస&comma; రేగు&comma; నిమ్మచెట్లు తూర్పు దిక్కులో ఉంటే సంతానప్రదం&period; ఇవి దక్షిణంలోనూ&comma; ఇతర దిక్కులలోనూ ఉన్నప్పుడు ధనప్రద ఫలితాన్నిస్తాయి&period; ఈ చెట్లన్నీ గృహస్థుడికి ఎంతో వృద్ధిని చేకూరుస్తాయి&period; అల్లనేరేడు&comma; దానిమ్మ&comma; అరటి తూర్పు దిక్కులో ఉంటే ఇంట్లో ఉండే వారికి బంధువులతో సఖ్యత కుదురుతుంది&period; ఇవే దక్షిణం దిక్కులో ఉంటే మిత్రప్రాప్తి కలుగుతుంది&period; సంపంగి చెట్టు ఇంటి ఆవరణలో ఏ దిక్కునైనా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర&comma; మంచి గుమ్మడి&comma; మోదుగ&comma; దోస ఇంటి ఆవరణలో ఉంటే మంగళప్రదాలు&period; మారేడు&comma; వంగ శుభప్రదాలు&period; పండ్లనిచ్చే తీగ‌à°² రకాల మొక్కలు ఎక్కడైనా ఉండొచ్చు&period; చెరకు ఎక్కడున్నా పర్వాలేదు&period; అలాగే అశోక&comma; శిరీషం&comma; కదంబ వృక్షాలు శుభప్రదం&period; పసుపు&comma; అల్లం మొక్కలు శుభకరాలు&period; గ్రామంలోనూ&comma; నగరంలోనూ కరక్కాయ చెట్టు ఉండడం శుభప్రదం&period; ఉసిరి చెట్టు కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుంది&period; ఉదయాన్నే లేచి తులసి చెట్టు చూసిన వ్యక్తికి బంగారం దానం చేసిన ఫలితం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాలతి&comma; మొల్ల&comma; కుందం&comma; మాధవి&comma; మొగిలి&comma; నాగకేసరం&comma; మల్లె&comma; పొగడ&comma; విష్ణుక్రాంతం అనే చెట్లు ఇంటి ఆవరణలో ఉండటం మంచిది&period; వీటితో ఉద్యానవనాలను కూడా పెంచవచ్చు&period; అలాగే బూరుగ&comma; చింత&comma; వేప&comma; వావిరి చెట్లను ఇంట్లో పెంచకూడదు&period; ఇవి అశుభకరాలు&period; ఉమ్మెత్త&comma; రావి&comma; ఆముదం లాంటి చెట్లు కూడా ఇంట్లో ఉండటం మేలు కాదు&period; భూమిలోకి ఎక్కువ దూరం వేళ్ళు పాతుకొనిపోయే చెట్లను ఇంట్లో పెంచకూడదు&period; ఇంట్లో మర్రి చెట్టు ఉంటే దొంగల భయం కలుగుతుంది&period; చింతచెట్టు ఇంట్లో ఉంటే ధనహాని&period; ఇలాంటి చెట్లు ఇళ్ళలో కాక వీధుల్లోనూ&comma; వనాల్లోనూ ఉండవచ్చు&period; బూరుగ చెట్టు ఇంట్లోకాని నగరంలో కానీ ఉంటే దుఃఖప్రదం&period; కనుక అది లేకుండా జాగ్రత్త వహించాలి అని శ్రీకృష్ణుడు విశ్వకర్మకు వివరించి చెప్పాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts