అప్పుడే పిల్లలు వద్దనుకుని ఎంజాయ్ చేసే జంటలోని మహిళకు గర్భం వచ్చిందని తెలిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉండడమేమిటి? నానా హైరానా పడిపోతారు. అబార్షన్ చేయించుకోవాలా, వద్దా అని సందేహిస్తుంటారు. కంగారు పడతారు. అమెరికాలోని ఓ మహిళకు కూడా సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే ఇందులో విశేషమేముంది, సహజమేగా అంటారా? అక్కడికే వస్తున్నాం. ఆ మహిళ సెక్స్‌లో పాల్గొనలేదు. అలా జరగకుండానే గర్భిణీ అయింది మరి. అదేంటి అలా ఎలా జరుగుతుంది? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదవండి.
అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో ఓ మహిళ సెక్స్‌లో పాల్గొనకుండానే గర్భం దాల్చింది. అయితే ఈ విషయం ఆమెకు తెలియదు. ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించగానే ఆశ్చర్యపోయింది. దీంతో వెంటనే వైద్యుల వద్దకు పరిగెత్తింది. అక్కడ తెలిసిన విషయమేమింటే, ఆమె సెక్స్‌లో పాల్గొనడం వల్లే గర్భిణీ అయిందని. దీంతో ఆ మహిళ మరోసారి షాక్‌కు గురైంది. అలా ఎలా జరుగుతుందని వైద్యులను ప్రశ్నించింది. ఈ క్రమంలో డాక్టర్ బ్రియాన్ స్టెయిక్సనర్ అనే ఓ వైద్యుడు ఆమెకు ఓపిగ్గా సమాధానమిచ్చాడు.
సాధారణంగా ఆడైనా, మగైనా జననావయవాలు, పిరుదులు, మలద్వారం వంటి భాగాలు వేర్వేరుగా నిర్మాణమవుతాయి. అలా నిర్మాణమైన అవయవాలు వేర్వేరుగానే పనులు చేస్తాయి. ఒక దాని పని మరొకటి చేయదు. కాగా కేవలం కొంత మందిలో మాత్రం ముందు చెప్పిన ఆ అవయవాలు సరిగ్గా నిర్మాణం కాక, అవన్నీ ఒక దాంట్లో ఒకటి కలిసి పోయినట్టుగా తయారవుతాయి. ఈ క్రమంలో పైన చెప్పిన మహిళకు కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఆమె మూత్రాశయం, యోని, గుదము అన్నీవేర్వేరుగా కాక అంతర్గతంగా ఒకే అవయవంలో నిర్మాణమయ్యాయి. ఈ క్రమంలో ఈ విషయం తెలియని ఆ మహిళ మల ద్వారం సెక్స్‌లో పాల్గొంది. దీంతో అక్కడ చేరిన వీర్యంలోని శుక్ర కణాలు యోనిలోకి, అటు నుంచి గర్భాశయంలోకి వెళ్లి ఆమెకు గర్భం వచ్చేలా చేశాయి. అసలు సంగతి అది.
కొన్ని కోట్ల మంది మహిళల్లో ఒకరికి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందట. దీన్ని వైద్య పరిభాషలో క్లోఆకల్ మాల్‌ఫార్మేషన్ (cloacal malformation) అని పిలుస్తారట. అయితే ఈ వార్త పాతదే అయినప్పటికీ మరోమారు వైరల్ అవుతోంది.