సోషల్ మీడియాలో మనకి అప్పుడప్పుడు వింతలు, విచిత్రాలు కనబడుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో కనపడే వాటిని నెట్టింట విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం.. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలని మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. వాటిని చూసి ఫన్నీగా ఉంటే నవ్వుకుంటూ ఉంటాం.
కొన్ని కొన్ని సార్లు భయంకరమైన వీడియోలు కూడా కనపడతాయి. భయంకరమైన జంతువుకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట షికార్లు కొడుతోంది. అది చూసిన నెటిజెన్స్ షాక్ కి గురవుతున్నారు. ఇక వీడియోలో ఏం జరిగింది అనేది చూస్తే.. ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటికి వచ్చాడు.
తర్వాత రోడ్డు మధ్యలో ఒక పంది అతనిపై దాడి చేసింది. సడన్ గా ఇలా ఒక పంది మీదకు రావడంతో అతను కిందపడిపోయాడు. పంది ఊరుకోలేదు. అతనిపై ఏదో పగబట్టినట్లు పోరాడింది. అతని బట్టల్ని కూడా లాగి పడేసింది. ఒక్కసారిగా స్థానికులు అలర్ట్ అయ్యారు. అతనికి సహాయం చేశారు. నెట్టింటి వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఏంటి పంది ఇంతలా మనిషి పై దాడి చేయడమా కంగారు పడుతున్నారు.