జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ ఏజెంట్ గా పని చేయాలని నిర్ణయించుకున్నారు. స్వయంగా ఆయనే డెలివరీ ఏజెంట్ గా ఫుడ్ డెలివరీ చేసి అందరినీ షాక్ అయ్యేలా చేద్దామనుకున్నారు. కానీ, ఆయన అనుకున్నట్లుగా అవేమీ జరగలేదు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గురుగ్రామ్ మాల్ నుంచి ఆయన పార్సిల్ ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లారు. కానీ, అక్కడ మెయిన్ ఎంట్రెన్స్ లేదా లిఫ్ట్ దగ్గరికి అనుమతి ఇవ్వలేదు. మొత్తం మెట్లు ఎక్కి ఫుడ్ కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కలిగింది.
ఆయన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. నేను సెకండ్ ఆర్డర్ ని డెలివరీ చేయడానికి వెళ్లేటప్పుడు మాల్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని.. అక్కడ వర్కింగ్ కండిషన్స్ ని మార్చాలని.. అందరి డెలివరీ పార్ట్నర్స్ కి కూడా ఈ మార్పులు చోటు చేసుకుంటే బాగుంటుందని, డెలివరీ పార్ట్నర్స్ పట్ల మాల్స్ కాస్త మంచిగా వ్యవహరించాలని పోస్ట్ చేశారు.
అలాగే దీని పట్ల మీరేమనుకుంటున్నారు అంటూ పోస్ట్ లో రాసుకోచ్చారు. జొమాటో డెలివరీ ఏజెంట్ లాగే ఆయన యూనిఫామ్ వేసుకుని ఎలా అయితే టీం ఇబ్బందులు ఎదుర్కొంటుందో.. అచ్చం అలానే ఆయన డెలివరీ చేయడానికి వచ్చారు. ఈ వీడియోకి చాలామంది రియాక్ట్ అయ్యారు. ఒకరు ఈ పోస్ట్ చూసి ప్రతి మాల్ లో ప్రతి ఆఫీస్ లో అందరూ ఉపయోగించే లిఫ్ట్ ని ఉపయోగించే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పారు. మరొకరు చెప్తూ.. కనీసం మీరైనా ఈ సమస్యని లేవనెత్తారని, చాలా మంది డెలివరీ చేసే వాళ్ళకి లిఫ్ట్ ఉపయోగించే సౌకర్యాన్ని ఇవ్వరని చెప్పారు.