యోగా

యోగా తర్వాత ఎంత సేపటికి స్నానం చెయ్యాలి…!

యోగా అనగానే కొంత మంది చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటారు. కాని దానికి అంటూ ఒక ప్రోటో కాల్ ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. యోగాకు అంటూ ఒక ప్రత్యేక ప్రోటో కాల్ ఉంటుంది. దానిని తప్పక పాటించాలి అంటున్నారు. లేకపోతే అసలు దాని వలన ఏ ఉపయోగం ఉండదు. అన్ని సక్రమంగా చేస్తే యోగా వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందుకు కొన్ని సూచనలు ఉన్నాయి.

పరిసరాలను, శరీరాన్ని, మనసును శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏమీ తినకుండా అంటే ఖాళీ కడుపున యోగ చేయాలి. లేదా మితాహారం తీసుకున్న తరువాత చేసినా పర్వాలేదు.. తేలికపాటి, సౌకర్యంగా ఉండే కాటన్‌ దుస్తులు వేసుకోవాలి. ప్రార్థన చేశాక యోగ ప్రారంభించాలి. హడావిడిగా కాకుండా ఆసనాలను నెమ్మదిగా వేయాలి. శరీరం గురించి తెలుసుకోవాలి. అలాగే ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు, శ్వాస నిలపడం వంటి విషయాలను జాగ్రత్తగా గమనిస్తుండాలి.

how much time we have to wait for bath after yoga

యోగ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో తప్ప నోటి ద్వారా గాలి పీల్చకూడదు. వదలకూడదు. యోగ పూర్తయ్యాక మెడిటేషన్‌ చేసి ఆ సెషన్‌ను ముగించాలి. ఈ సమయంలో నేల మీద సూది పడినా వినపడేంత నిశ్శబ్దం ఉండాలి. యోగ చేసిన 20 లేదా 30 నిమిషాల తరువాతే స్నానం చేయాలి. యోగ పూర్తి చేసిన 20 లేదా 30 నిమిషాల తరువాతే.

Admin

Recent Posts