రోగ నిరోధక శక్తిని పెంచే సైతల్యాసనం.. ఎలా వేయాలంటే..?

వర్షాకాలంలో మనకు సహజంగానే అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. జ్వరాలు వ్యాపిస్తాయి. దగ్గు, జలుబు వస్తాయి. కనుక రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇల్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలను కట్టడి చేయాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే కింద తెలిపిన ఆసనం వేయడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీంతో ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ ఆసనం ఏమిటంటే..

increase your immunity power with saithalyasanam

సైతల్యాసనం వేసే విధానం

ఎడమకాలును వెనక్కి మడిచి కుడిపాదాన్ని ఎడమతొడపై ఉంచి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ, రెండు చేతుల్నీ పైకి తీసుకురావాలి. ఇప్పుడు చేతుల్ని చాపి నేల మీద ఉంచి.. శ్వాస వదులుతూ కుడిమోకాలి వైపు ముందుకు వంగాలి. గడ్డాన్ని కుడి మోకాలికి ఆనించే ప్రయత్నం చేయాలి. ఇలా 5 సెకన్ల పాటు ఉన్నాక, తిరిగి శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. మళ్లీ శ్వాస వదులుతూ ముందుకు వంగాలి. ఇలా కుడివైపు ఆరు సార్లు చేయాలి. ఇదే విధంగా ఎడమ వైపు ఆరు సార్లు చేయాలి.

సైతల్యాసనం వేయడం వల్ల కలిగే లాభాలు

1. ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

2. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

3. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

4. వెన్ను నొప్పి తగ్గుతుంది. వెన్ను దృఢంగ మారుతుంది. తొండ కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

5. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

6. పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. పొట్ట కండరాలు దృఢంగా మారుతాయి.

Share
Admin

Recent Posts