Sri Reddy : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ మేనియా నడుస్తోంది. కారణం.. ఆయన నటించిన భీమ్లానాయక్ ట్రైలర్ రిలీజ్ కావడమే. అందులో పవన్ విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. అయితే పవన్ అంటేనే మండిపడే శ్రీరెడ్డి ఈసారి కూడా ఆయనపై నెగెటివ్ కామెంట్స్ చేసింది.
పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ చిత్ర ట్రైలర్‌పై శ్రీరెడ్డి నెగెటివ్ కామెంట్లు చేసింది. ఈ మూవీ ట్రైలర్ అనుకున్నంత బాగా ఏమీ లేదని పేర్కొంది. అలాగే ఈ మూవీ బిలో యావరేజ్.. అని వ్యాఖ్యానించింది. దీంతో శ్రీరెడ్డి కామెంట్స్‌పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యథావిధిగానే ఆమెపై వారు నెగెటివ్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక భీమ్లా నాయక్ సినిమాలో పవన్‌తోపాటు రానా మరో కీలకపాత్రను పోషించారు. అయితే ఈ చిత్ర ట్రైలర్‌పై మరో వైపు వర్మ కూడా నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా మొత్తం రానానే కనిపిస్తాడని.. హిందీ ప్రేక్షకులకు పవన్ తెలియదు కనుక.. రానానే వారు ఇందులో హీరోగా అనుకునే అవకాశం ఉందని.. మేకర్స్ ఈ పొరపాటు ఎందుకు చేశారోనని ఆశ్చర్యంగా ఉందని.. రామ్ గోపాల్ వర్మ అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.