Keerthy Suresh : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమాలోని మొదటి పాట కళావతిని ఈ మధ్యే విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే తాజాగా కీర్తి సురేష్ చేసిన పని అందరినీ అప్‌సెట్ చేసిందని అంటున్నారు.
కీర్తిసురేష్ ఈమధ్యే గాంధారి అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. ఇది సర్కారు వారి పాట మేకర్స్‌కు విసుగు తెప్పించిందట. ఎందుకంటే.. నటిగా అంత పేరు ఉండి అలాంటి థర్డ్ గ్రేడ్ పాటల్లో నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు. అందుకనే సర్కారు వారి పాట మేకర్స్‌తోపాటు ప్రేక్షకులు కూడా ఈ విషయంలో అప్ సెట్ అయినట్లు తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు పక్కన కీర్తి సురేష్ అసలు సెట్ కాలేదని కూడా కొందరు అంటున్నారు. ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ అనేక చిత్రాల్లో నటించగా.. అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. రజనీకాంత్ పెద్దన్న, గుడ్ లక్ సఖి.. వంటి మూవీలు ఈ మధ్య కాలంలో వచ్చాయి. అవన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో మహేష్ పక్కన కీర్తి సురేష్ అసలు సెట్ కాదని, ఆమెది ఐరన్ లెగ్ అని.. కనుక ఆ ప్రభావం సర్కారు వారి పాటపై ఉంటుందని అంటున్నారు. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శనను ఇస్తుందో చూడాలి.