Malaika Arora : ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా తరచూ విమర్శలకు గురవుతుంటుంది. ఆమె ధరించే డ్రెస్సులతోపాటు ఆమె చేసిన పనులు వివాదాస్పదం అవుతుంటాయి. తనకంటే వయస్సుతో ఎంత చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ఆమె రిలేషన్ షిప్ కొనసాగిస్తుండడంపై కూడా తరచూ విమర్శలు వస్తుంటాయి. ఇక తాజాగా ఈ నటి మరోమారు విమర్శల బారిన పడింది.
మలైకా అరోరా ఓ వైట్ టాప్ ధరించి దాని మీద బ్రౌన్ కలర్‌లో ఉండే మరో టాప్ వేసుకుంది. అయితే చూసేందుకు అది అచ్చం గోనె సంచిలా ఉండడం విశేషం. ఇక కింద ప్యాంట్స్ ఏమీ వేసుకోలేదు. దీంతో విమర్శకులు మరోమారు తమ నోళ్లకు పని చెప్పారు. మలైకా అరోరా గోనె సంచి ధరించింది ఏమిటి ? ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే మలైకా అరోరా మాత్రం తన డ్రెస్ తన ఇష్టం అంటోంది. అందరూ మహిళలు ధరించే డ్రెస్సులపైనే ఎల్లప్పుడూ కామెంట్లు చేస్తుంటారని.. వారి ఇష్టాలు వారికి ఉంటాయని.. వారు ధరించే దుస్తుల మూలంగా వారిని విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ ? అని ఈ బ్యూటీ ప్రశ్నించింది. ఇక ఈమె ప్రస్తుతం ఓ ఫిట్‌నెస్ సంస్థతో కలిసి యోగా వీడియోలను రూపొందిస్తూ యోగాలో పాఠాలను నేర్పిస్తోంది.