Hamsa Nandini : ఎన్నో హిట్ చిత్రాల్లో నటించడంతోపాటు ఐటమ్ సాంగ్‌లలోనూ డ్యాన్స్ చేసి నటి హంస నందిని ఎంతో పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈమె క్యాన్సర్‌తో పోరాడుతోంది. గతేడాది డిసెంబర్‌లో తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని ఈమె తెలియజేసింది. ఈ క్రమంలోనే అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇక తన క్యాన్సర్ ట్రీట్‌మెంట్ గురించి ఈమె తాజాగా అప్ డేట్ ఇచ్చింది.
తాను ఇప్పటికే 16 సైకిల్స్ లో కీమోథెరపీ చేయించుకున్నానని.. దీంతో కొంత వరకు ఊరట కలిగిందని.. అయితే క్యాన్సర్‌పై తన పోరాటం ఇంకా ముగియలేదని.. హంస నందిని పేర్కొంది. ఇకపై తాను సర్జరీల కోసం సిద్ధమవుతున్నానని.. క్యాన్సర్‌పై విజయం సాధించే రోజు దగ్గరలోనే ఉందని ఆమె పేర్కొంది. ఈ మేరకు ఆమె తన సోషల్ ఖాతాల్లో ఈ వివరాలను తెలియజేసింది.
అయితే హంస నందిని పెట్టిన పోస్టును చూస్తే ఆమె ఎంత కష్టంలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. క్యాన్సర్ అంటే మామూలు విషయం కాదు. అది రావడం ఒకెత్తయితే దానికి చికిత్స తీసుకోవడం మరొక ఎత్తు. ఆ చికిత్సకు తట్టుకుని నిలబడాలి. ప్రస్తుతం ఆమె ఇలాంటి కష్ట స్థితిలోనే ఉంది. ఈ క్రమంలోనే ఆమె త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ప్రేక్షకుల ముందుకు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.