Samantha : ఇటీవలి కాలంలో సమంత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే ఈమె తరచూ పలు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇక తాజాగా ఈమె తన ఫిట్ నెస్ సెషన్‌లో భాగంగా కఠినమైన వ్యాయామం చేసింది. ట్రెయినర్ ఆధ్వర్యంలో చాలా కష్టమైన వ్యాయామాలను చేసింది. అందులో ఆమె నాగినిలా గుండ్రంగా తిరగడాన్ని చూడవచ్చు.
ఇక ఈ వ్యాయామంలో భాగంగా ఆమె ఫిట్ నెస్ ట్రెయినర్ జునెయిద్ షేక్ ఆమెను నాగినిగా అభివర్ణించాడు. ఇటీవలే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన సమంత ఆ పాటలోనూ ఇలాగే ఒక ఊపు ఊపింది. అలాగే విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలోని ఓ పాట తాజాగా విడుదల కాగా దానికి కూడా సమంత స్టెప్పులేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన తమిళ చిత్రం కాతువాకుల రెండు కాదల్ త్వరలో విడుదల కానుంది. అలాగే ఈమె నటించిన శకుంతలం సినిమాలో ఈమె ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. త్వరలో ఈ సినిమాతోపాటు యశోద అనే మరో మూవీ కూడా విడుదల కానుంది.