Bigg Boss Non Stop : బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ షో మళ్లీ వచ్చేసింది. ఈ షోను కాసేపటి క్రితమే ప్రారంభించారు. బిగ్ బాస్ నాన్ స్టాప్‌గా ప్రసారం అవుతున్న ఈ షో కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్‌లోనే ప్రసారం కానుంది. ఈ షోను రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. కాగా హోస్ట్ నాగార్జున శనివారం సాయంత్రం మొత్తం 17 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. దీంతో బిగ్ బాస్ వినోదం మళ్లీ ప్రేక్షకులకు లభిస్తోంది.
ఇక బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. హౌస్‌లోకి అషు రెడ్డి, మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్, యాంకర్ స్రవంతి చొక్కారపు, ఆర్‌జే చైతూ, అరియానా, నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక, మోడల్ అనిల్ రాథోడ్, నటి, నిర్మాత మిత్రా శర్మ, తేజస్వి మడివాడ, సరయు, యాంకర్ శివ, హీరోయిన్ బిందు మాధవి, హమీదా, అఖిల్ సార్థక్ లు ఎంటర్ అయ్యారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలోనే వీరిలో కొందరు పాత కంటెస్టెంట్లు ఉన్నారు.
ఇక హౌస్‌లోకి ఎంటర్ అయ్యాక మొదటి టాస్క్ ను ఇచ్చారు. బిగ్ బాస్‌లోకి వచ్చే వ్యక్తిని రోస్ట్ చేయాలని చెప్పారు. ఈ క్రమంలోనే అషు రెడ్డి, ముమైత్ ఖాన్, మహేష్ విట్టాలకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా వారు నటుడు అజయ్‌ను రోస్ట్ చేశారు. ఈ క్రమంలో షో సందడిగా ప్రారంభం అయింది. ఇక వీరిలో ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు విజేతగా నిలుస్తారు.. అన్నది షో గడిచేకొద్దీ తెలుస్తుంది. అయితే ఇందులో టాప్ 5 లో నిలిచిన వారు బిగ్ బాస్ సీజన్ 6లో నేరుగా పాల్గొంటారని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావల్సి ఉంది.