Son of India : కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాకు డైమండ్ బాబు దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతం అందించారు. అయితే సన్ ఆఫ్ ఇండియా మూవీ అత్యంత చెత్త సినిమాగా రికార్డులకెక్కింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఇంతటి భారీ ఫ్లాప్ అయిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా నెగెటివ్ టాక్‌తో అతి పెద్ద డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది.
ఈ మూవీ ఆరంభం రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని చోట్ల మధ్యాహ్నం షోకే ప్రేక్షకులు లేక షోలను క్యాన్సిల్ చేశారు. అలగే కొన్ని థియేటర్లలో కేవలం 2 నుంచి 3 శాతం వరకు మాత్రమే ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఈ క్రమంలో ఈ సినిమాకు ఓపెనింగ్ రోజు కేవలం రూ.6 లక్షల గ్రాస్ మాత్రమే రాగా.. మొత్తం రూ.35 లక్షల కలెక్షన్లు వచ్చాయని తేల్చారు. దీంతో అత్యంత భారీ ఫ్లాప్‌ను, నష్టాన్ని మూటగట్టుకున్న సినిమాగా ఈ మూవీ రికార్డులకెక్కింది.
ఈ సినిమాను మోహన్ బాబు సొంత బ్యానర్స్ అయిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీలు కలసి సంయుక్తంగా తెరకెక్కించాయి. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని మేకర్స్ తెలిపారు. అయితే చాలా రోజుల తరువాత మోహన్ బాబు పూర్తి స్థాయిలో నిడివి ఉన్న పాత్రలో నటించారు. అయినా ఆయన ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయారు.
ఇక ఈ సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు అప్పటికే సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు, ట్రోల్స్ వారిపై నడుస్తున్నాయి. దీంతో సహజంగానే ఈ మూవీ ఫ్లాప్ అయింది. అయితే ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో మరింత హుందాగా వ్యవహరించి ఉంటే.. సన్ ఆఫ్ ఇండియా సినిమా మరీ ఇంత ఫ్లాప్ కాకుండా ఉండేదని.. ఒక మోస్తరుగా నడిచి ఉండేదని అంటున్నారు.
అయితే ఈ సినిమాకు మొత్తం వచ్చిన కలెక్షన్లు రూ.35 లక్షలు మాత్రమే అని తెలిసి నెటిజన్లు మరోమారు మంచు ఫ్యామిలీపై విమర్శలు చేస్తున్నారు. అత్యంత చెత్త సినిమాల్లో ఇది నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని అంటున్నారు. వాస్తవానికి థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే కాస్త పరువైనా దక్కేదని అంటున్నారు. దీనిపై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.