Shanku Pushpam : మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిలో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధ మొక్కల గురించిన ప్రస్తావన ఉంది. కానీ వాటిలో మనకు తెలిసింది కేవలం కొన్ని మొక్కలు మాత్రమే. అలాంటి మొక్కల్లో శంకు పుష్పం మొక్క ఒకటి. ఇది మన చుట్టూ పరిసరాల్లో పెరుగుతుంది. దీని పువ్వులు నీలం, తెలుపు రంగులో ఉంటాయి. అయితే నీలం రంగు శంకుపుష్పంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తారు. ఈ పుష్పంతో నీటిని తయారు చేసి రోజుకు ఒక కప్పు తాగితే ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు.
రెండు లేదా మూడు శంకు పుష్పాలను సేకరించి శుభ్రంగా కడిగి వాటిని ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. 10 నిమిషాల పాటు మరిగాక ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగేయాలి. అయితే నిమ్మరసం కలపగానే రంగు మారుతుంది. కనుక ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇలా తయారు చేసుకున్న శంకు పుష్పం నీటిని రోజుకు ఒకసారి ఏ సమయంలో అయినా తాగవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
1. శంకు పుష్పం నీళ్లను రోజుకు ఒక కప్పు మోతాదులో తాగితే ఎలాంటి శ్వాసకోశ సమస్య అయినా సరే తగ్గిపోతుంది. ఆస్తమా, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరంలో ఉండే కఫం మొత్తం కరిగిపోతుంది.
2. శంకు పుష్పం నీళ్లను తాగడం వల్ల శరీరంలో కొల్లాజెన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మంపై ముడతలు, మచ్చలను తొలగిస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.
3. శంకు పుష్పం నీళ్లను తాగడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
4. శంకు పుష్పం నీళ్లను తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
5. మద్యానికి బానిస అయిన వారు రోజూ శంకు పుష్పం నీళ్లను తాగితే త్వరగా ఆ అలవాటు నుంచి బయట పడతారు. అలాగే బలహీనంగా ఉన్నవారికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు.