Avinash : బుల్లితెరపై ఎన్నో షోస్ చేస్తూ కామెడీ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న అవినాష్.. గత ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. అనూజా అనే అమ్మాయితో అవినాష్ వివాహం జరగగా, ప్రస్తుతం ఈ జంట తెగ సందడి చేస్తున్నారు. ఇద్దరూ కలిసి పలు షోలలో పాల్గొంటుండగా, అవినాష్ మా టీవీలో కామెడీ షో చేస్తున్నాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అవినాష్.. విష్ణుప్రియపై ఆవేశంతో రెచ్చిపోవడం గమనించవచ్చు. స్కిట్ లో భాగంగా అవినాష్.. పెళ్లికి పిలవకపోతే ఎవరైనా ఇలా చేస్తారా.. అంటూ తన బాధని నాగబాబుకి చెప్పుకున్నాడు.
ఇక ప్రోమోలో తన ఫ్రస్ట్రేషన్‌ను అవినాష్ బయటపెట్టేశాడు. యాంకర్ విష్ణు ప్రియ తన పెళ్లికి వచ్చి తెగ వ్లాగ్ లు చేసిందని, ఆమె చేయడం వలన నా వీడియోలు చేసే వాడు లేకుండా పోయాడంటూ బాధను వ్యక్తపరిచాడు. నాకూ ఓ యూట్యూబ్ చానెల్ ఉంది.. నేను వీడియో తీసుకుని వ్లాగ్ చేసుకుందామని అనుకున్నా.. కానీ పొద్దున్నే ఏడు గంటలకు వచ్చి అంతా వీడియో తీసింది.. వ్లాగ్ చేసేసింది.. నాకు వ్యూస్ రాలేదు అని అవినాష్ తన బాధను వ్యక్తం చేశాడు. మొత్తానికి మనసులోని బాధను ఇలా బయటపెట్టిన అవినాష్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు.
అవినాష్ పెళ్లి వేడుకలో పలువురు జబర్దస్త్ కమెడియన్లతోపాటు బిగ్ బాస్ కంటిస్టెంట్స్ తెగ సందడి చేశారు. ముఖ్యంగా శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్ అయింది. గత ఏడాది అక్టోబర్ 20న అవినాష్ పెళ్లి జరగగా, 24న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తన సొంత ఊరు జగిత్యాలలో జరిగిన వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు, జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు ఒకే చోట చేరి తెగ సందడి చేశారు. చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, శ్రీముఖిల అల్లరితో పెళ్లింట సందడి వాతావరణం నెలకొంది. మెహెందీ, హల్దీ, పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్నింటా ఫుల్ ఎంజాయ్ చేస్తూ హంగామా చేశారు.