Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత ఫిట్‌నెస్‌కి ఎంత ప్రియారిటీ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ చక్కని ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న సామ్ తన అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. అయితే సినిమాలోని ప్రతి పాత్ర కోసం సమంత తన రూపాన్ని మార్చుకుంటుందట. ఇటీవలే ఊ అంటావా .. పాట కోసం సరిపడే రూపం కావాలని టీమ్ కోరగా దానికోసం చాలా శ్రమించిందట. ఊ అంటావా పాట కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు సామ్ చాలా కండిషనింగ్ వర్కౌట్ లు చేసిందట.
ఫిట్ నెస్.. హ్యాండ్స్ డౌన్ అని చెప్పాలంటే అది సమంతనే అనాలి. డెడ్ లిఫ్ట్ లు.. స్క్వాట్ లు.. చేయడంలో సామ్ ఆరితేరిపోయింది. తన ఫిట్ నెస్ శిక్షకుడు జునైద్ లీక్ చేసిన సమాచారం షాకిస్తోంది. జునైద్ షేక్ మాట్లాడుతూ “మీరు అథ్లెట్ అయ్యి ఉంటే.. విరాట్ కోహ్లీలా ఉండేవారు“ అని సమంతతో ఎల్లప్పుడూ చెబుతుంటాడట. “ నేను మళ్లీ ప్రయత్నిస్తాను చేస్తాను“ అని చెప్పే వైఖరిని కలిగి ఉంటుందట సామ్. చాలా దూకుడుగా ఉంటుంది. కష్టమైన పనులు కూడా చేయాలనుకుంటుంది. ఆమెను చూసి నేను స్పూర్తిని పొందుతా. ఈ చెన్నై సుందరి ప్రతి రోజు ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్స్ పూర్తి చేస్తుందన్నాడు ట్రైనర్.
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం యశోద . హరి-హరీష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో సామ్ టైటిల్ రోల్ చేస్తోంది. యశోద సినిమా కోసం మేకర్స్ భారీ ఖర్చుతో సెట్స్ ను రెడీ చేశారట. తాజా టాక్ ప్రకారం సుమారు రూ.3 కోట్లతో భారీ సెట్ వేశారట. మరోవైపు సమంత శాకుంతలం చిత్రం చేస్తుండగా, ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అలాగే తమిళ మూవీ ఒకటి విడుదలకి సిద్ధం అవుతుంది. సమంత లైనప్ మాములుగా లేదు.