ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఏపీలో నిన్న మొన్నటి వరకు సినిమా టిక్కెట్ల ధరల విషయంలో సమస్యలు ఉండేవి. ఇప్పుడు ఇవి కూడా తీరిపోయాయి. అలాగే అక్కడ అదనపు షో ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతులు ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ భారీ ఎత్తున కలెక్షన్లను రాబట్టాలని ఆలోచిస్తోంది.
అయితే ఏ మూవీ అయినా సహజంగానే విడుదలైన 30 రోజులకు ఓటీటీలకు వస్తోంది. కొన్ని సినిమాలు అయితే ఇంకా త్వరగా రెండు వారాల్లోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు చాలా మంది ఓటీటీల్లో సినిమాలను చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. థియేటర్లకు వెళ్లేంత టైమ్ లేని వారు ఓటీటీలనే నమ్ముకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ కోసం మాత్రం వారు కాస్త ఎక్కువ సమయమే ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే సినిమా విడుదలయ్యాక 90 రోజులకు ఓటీటీలో ఈ మూవీని ప్రసారం చేసేలా మేకర్స్ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. అందువల్ల ఆర్ఆర్ఆర్ సినిమాను ఓటీటీలో చూద్దామని ఆగేవారు చాలా రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుంది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషలకు చెందిన డిజిటల్ హక్కులను స్టార్ ఇండియా కొనుగోలు చేసిందని తెలుస్తోంది. అంటే.. ఈ భాషల్లో ఆర్ఆర్ఆర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుందన్నమాట. ఇక హిందీ వెర్షన్ హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఇంగ్లిష్, స్పానిష్, పోర్చుగీస్, కొరియన్ భాషల డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓటీటీలకు హక్కులను విక్రయించడం ద్వారానే ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగానే వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూవీ విడుదలైన 90 రోజులకు.. అంటే.. జూన్ 25 తరువాతే ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఓటీటీ యాప్‌లలో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. మరి ఓటీటీ ఆడియన్స్ అప్పటి వరకు వేచి చూసే ఓపిక లేకపోతే ఈ సినిమాను థియేటర్‌లో చూడడమే బెటర్..!