Nagababu : మెగా బ్రదర్ నాగబాబు.. అంటే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. జబర్దస్త్ షో. ఈయన అందులో అనేక సంవత్సరాల పాటు జడ్జిగా ఉన్నారు. గతంలో ఈయన సినిమాల్లో చేసేవారు. కానీ జబర్దస్త్ లో జడ్జిగా చేస్తున్నప్పటి నుంచి సినిమాలను తగ్గించేశారు. ఎప్పుడో ఒకటి, రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాక అందులో చేరి పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లోనూ ఆయన అప్పుడప్పుడు పాల్గొంటున్నారు. జనసేనకు నాగబాబు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే తాజాగా నాగబాబు ట్విట్టర్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. అందులో ఆయన ఏం చెప్పారంటే..

తన ఇన్నేళ్ల జీవితంలో తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని నాగబాబు తెలిపారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తనను తాను మార్చుకున్నానని.. ఒక రకంగా చూస్తే ఒక మనిషి తాను జీవితంలో ఎదుర్కొనే కష్ట నష్టాలతో అతను తన జీవితాన్ని మార్చుకోగలడని అన్నారు. తాను పుట్టి పెరిగిన తన దేశానికి, తన ప్రజలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని వివరించారు. అందులో భాగంగానే ఒక కొత్త గమ్యంతో లక్ష్యం వైపు ప్రయాణం సాగించాలని చూస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో ఎలాంటి కష్టాలు, నష్టాలు ఎదురైనా ముందుండి పోరాటం చేస్తానని.. తనకు ఎదురయ్యే కష్టాలు, నష్టాలే తనను నడిపిస్తాయని అన్నారు.
ఇక త్వరలో తన పూర్తి సమయాన్ని తన గమ్యాన్ని చేరుకుంటానికే ఉపయోగిస్తానని నాగబాబు తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తానని ఆయన ముగించారు. దీంతో ఆయన పెట్టిన ఈ పోస్టు వైరల్‌గా మారింది. అయితే ఆయన మాటలను బట్టి చూస్తే ఆయన సినిమాలను వదిలి రాజకీయాలకే పూర్తి సమయం కేటాయిస్తారని తెలుస్తోంది. కానీ ఆయన రాజకీయాలను వదిలి కేవలం సినిమాలపైనే దృష్టి పెడతారని.. త్వరలోనే భారీ ఎత్తున మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి వస్తారని అంటున్నారు. మరి దీనిపై అసలు విషయం ఏమిటి ? అనేది తెలియాలంటే.. ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. ఈ క్రమంలోన సినిమాలా.. రాజకీయాలా.. నాగబాబు ఎటు వైపు వెళ్తారు ? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.