Samsung Galaxy F23 5G : ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఇటీవలే గెలాక్సీ ఎఫ్23 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను బుధవారం నుంచి విక్రయిస్తున్నారు. శాంసంగ్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఇక ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 750జి ప్రాసెసర్, వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా, 5జి, డాల్బీ అట్మోస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12, యూఎస్‌బీ టైప్ సి.. వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
ఇక ఈ ఫోన్ రెండు వేరియెంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999 ఉండగా.. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా ఉంది. ఐసీఐసీ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.1000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఈ ఫోన్‌ను కొన్నవారికి 2 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు.