Nagababu : మెగా బ్రదర్ నాగబాబుకు, మంచు ఫ్యామిలీకి మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది. ఓ వేడుకలో భాగంగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. ఆ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల మోహన్ బాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ 30వ వార్షికోత్సవంలో భాగంగా మోహన్ బాబు జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ తాను జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డది.. చెప్పుకొచ్చారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ కూడా మాట్లాడారు. ఆయన నాగబాబుపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశారు. ఇండస్ట్రీలో ఎవరికీ శత్రుత్వం ఉండదని.. కానీ మా ఎలక్షన్స్ టైంలో ఓ వ్యక్తి తన అన్నని, నాన్నని టార్గెట్ చేశాడని.. తమ ప్యానల్‌కి సపోర్ట్ చేసిన వాళ్లని బూతులు కూడా తిట్టాడని.. అయినప్పటికీ తన అన్న, నాన్న వదిలేయమని చెప్పారన్నారు మనోజ్. ఎందుకంటే.. ఆ వ్యక్తికి హయ్యర్ పర్సస్ లేదని చెప్పారంటూ హయ్యర్ పర్సస్ గురించి వివరించారు మనోజ్.
ఆ వ్యక్తికి అసలు హయ్యర్ పర్సస్ అనేది లేదు.. హయ్యర్ పర్పస్ లేని వ్యక్తులకు ఏం చేయాలో తోచదు.. ఎప్పుడూ పక్క వారి మీద పడుతుంటారు.. వారికంటూ ఓ లక్ష్యం, గమ్యం ఉండదు.. అతని చుట్టూ ఎంతో మంది గొప్పవాళ్లు ఉన్నారు.. ఆయన ఫ్యామిలీలో జనానికి ఏదోటి చేయాలనే తపన ఉన్నవాళ్లు ఉన్నారు.. కానీ ఆయనకు మాత్రం ఏదీ లేకుండా ఉండిపోయారు.. మనం హయ్యర్ పర్సస్ లేకుండా జీవించకూడదు.. సొంతంగా గోల్ ఉండాలి.. దానికోసమే పనిచేయాలంటూ.. నాగబాబుపై మంచు మనోజ్ సెటైర్లు వేశారు.
అయితే తాజాగా లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన నాగబాబు.. మనోజ్ కామెంట్లకు కౌంటర్ వేశారు. ఇన్ని రోజుల తరువాత మీరు లైవ్‌లోకి వచ్చారు, కారణం ఏంటి ? అని ఒక నెటిజన్ అడగ్గా.. అందుకు నాగబాబు స్పందిస్తూ.. హయ్యర్ పర్పస్ కోసం అని చెప్పారు. అలాగే ఇక పని మొదలుపెడతా అని కూడా అన్నారు. మరి మంచు ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చేందుకు నాగబాబు ఇంకా ఏమేం చేస్తారో చూడాలి.