హిందూమతంలో వారంలోని ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడిన రోజుగా ఉంటుంది. ఇక మంగళవారం నాడు హనుమాన్ కు అంకితమైన రోజుగా చెప్పబడుతుంది. హిందూ మత విశ్వాసం ప్రకారం ఈరోజు కొన్ని పనులు చేయకుండా దూరంగా ఉండాలి. మంగళవారం నాడు ఎటువంటి పనులు చేయకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం నాడు పొరపాటున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఈరోజు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే ఛాన్స్ దాదాపు తక్కువ. మంగళవారం నాడు పొరపాటున కూడా ఇనుప వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి. ముఖ్యంగా కత్తులు, కత్తెరలు, ఉక్కు, ఇనుముతో తయారుచేసిన వస్తువులను మంగళవారం నాడు కొనుగోలు చేయకుండా ఉంటే మంచిది.
మంగళవారం నాడు ఉత్తరం, పడమర దిక్కుల్లో ప్రయాణించకూడదని చెబుతారు. మంగళవారం రోజు ఈ రెండు దిక్కుల్లో ప్రయాణం చేస్తే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మంగళవారం రోజున మనసులో కూడా కోపం ఉండకుండా జాగ్రత్త పడాలని, ఆరోజు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం శుక్ర, శని గ్రహాలకు సంబంధించిన పనులు కూడా చేయకూడదు. మంగళవారం రోజు మాంసాహారానికి, మద్యపానానికి దూరంగా ఉండాలి. అంతేకాదు మంగళవారం నాడు హనుమంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు పాలతో చేసిన మిఠాయిలు నైవేద్యంగా పెట్టకూడదు.
మంగళవారం నాడు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. హనుమాన్ బ్రహ్మచారి కాబట్టి, మంగళవారం నాడు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది. మంగళవారం నాడు జుట్టు, గోళ్ళు కత్తిరించకుండా ఉండాలి. ఒకవేళ జుట్టు, గోళ్ళు కత్తిరిస్తే హనుమాన్ ఆగ్రహిస్తాడు. మంగళవారం నాడు ఉపవాసం ఉండేవారు ఉప్పును, రాతి ఉప్పును తీసుకోకుండా చూడాలి. మంగళవారం నాడు చేయకూడని పనులు చేస్తే హనుమాన్ కటాక్షం ఉండదు. మంగళవారం నాడు ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే హనుమాన్ తప్పకుండా కరుణిస్తాడు.