Samantha : నాగచైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమంత ఎంతో బిజీగా ఉందని చెప్పవచ్చు. వాస్తవానికి చైతూ కంటే సమంతనే ఎక్కువ బిజీగా ఉంది. పలు సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ప్రస్తుతం ఆమె యశోద అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. అందులో భాగంగానే ఆమె ఉత్తర భారత దేశంలో ఉంది. ఇక ఆమె వెంట ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రీతమ్‌పై సమంత తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తరువాత ఎక్కువగా ట్రోల్స్, విమర్శలకు గురైంది.. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ అని చెప్పవచ్చు. వారిద్దరూ విడిపోయేందుకు ప్రీతమ్ కారణమని చాలా వార్తలు వచ్చాయి. దీంతో ప్రీతమ్‌కు, సమంతకు మధ్య ఏదో ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటిని సమంత, ప్రీతమ్‌లు కొట్టి పారేశారు. తాను సమంతను అక్కా అని పిలుస్తానని ప్రీతమ్ తెలిపాడు. ఇక సమంతకు స్టైలిస్ట్‌గా ఉండే ప్రీతమ్ షూటింగ్ సమయాల్లో ఆమె వెంటే ఉంటాడు.
తాజాగా యశోద సినిమా షూటింగ్‌లో భాగంగా ప్రీతమ్ సమంతతోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అతనితో సమంత టైమ్ పాస్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. అందులో భాగంగానే ఆమె అతనికి హెయిర్ కట్ కూడా చేసింది. అయితే తనకు అన్ని పనులు వచ్చని.. హెయిర్ కట్ కూడా చేస్తానని.. కనుక ప్రీతమ్ తనకు ఈ పని చేసినందుకు డబ్బులు ఇవ్వాలని సమంత పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇక యశోదతోపాటు శాకుంతలం అనే మూవీలోనూ సమంత యాక్ట్ చేసింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇటీవల పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంతో సమంతకు పాపులారిటీ బాగా వచ్చింది. దీంతో ఆమెకు ఐటమ్ సాంగ్స్‌లోనూ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.