Chaddannam : చద్దన్నం తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని ప్రాంతాల వారు చద్దనాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. మన పూర్వీకులు చద్దన్నాన్నే చాలా వరకు ఉదయం ఆహారంగా తీసుకునే వారు. ఉదయమే చద్దన్నాన్ని తినడానికి గాను రాత్రి పూటనే అన్నాన్ని ఎక్కువగా వండుకోవాలి. చద్దన్నాన్ని పిల్లలకు పెట్టడం వల్ల పుష్టిగా తయారవుతారు. శరీరానికి కావల్సిన పోషకాలు అన్ని చద్దన్నంలో ఉంటాయి.
చద్దన్నంలో ఐరన్, మెగ్నీషియం, బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి. మాంసాహారం తినని వారికి బి 12 విటమిన్ అధికంగా లభించదు. అన్నాన్ని రాత్రంతా నిల్వ ఉంచడం వల్ల ఈ అన్నంలో శరీరానికి కావల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ తయారవుతాయి. అన్నాన్ని నీళ్లలో కానీ, గంజిలో కానీ వేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలి. చద్దన్నాన్ని మరో విధంగా కూడా తయారు చేసుకుని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.
చద్దన్నానికి పెరుగును జోడించి కూడా ఆహారంగా తీసుకోవచ్చు. ఇలా పెరుగును కలిపి తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. వేసవి కాలంలో చద్దన్నాన్ని తినడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది. రాత్రి వండిన అన్నానికి ఉదయం పెరుగును కలిపి తినవచ్చు లేదా రాత్రి వండిన అన్నంలో గోరు వెచ్చని పాలు పోసి కొద్దిగా పెరుగు వేసి తోడు వేయాలి. ఉదయాన్నే రుచికి తగినంత ఉప్పు వేసుకుని బ్రేక్ ఫాస్ట్ గా తినవచ్చు. దీన్ని తోడన్నం అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు.
బరువు పెరగాలి అనుకునే వారికి చద్దన్నం ఎంతగానో సహాయపడుతుంది. చద్దన్నం తినడం వల్ల అనారోగ్యంతో కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. చద్దన్నం ఎంతో శ్రేష్టమైనది. కనుక కనీసం వారంలో రెండు సార్లు అయినా సరే చద్దన్నాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.