Over Weight : అధిక బరువు సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీని వల్ల ఇతర అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కనుక బరువు తగ్గడం ఆవశ్యకం అయింది. అధిక బరువును తగ్గించుకోకపోతే షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే ఇందుకు గాను ఆయుర్వేద వైద్యం ఎంతగానో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో చెప్పినట్లు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. శరీరంలో ఉండే నీరు, కొవ్వు కరుగుతుంది. సన్నగా మారుతారు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. ఉలవలను 100 గ్రాముల మోతాదులో తీసుకుని వాటిని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని ఉడికించి గుగ్గిళ్ల మాదిరిగా తయారు చేసుకోవాలి. వాటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో కలిపి తినాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.
2. పచ్చి బొప్పాయి పండ్లను తెచ్చి ముక్కలుగా కోసి వాటితో కూర వండుకుని తింటుండాలి. దీంతో శరీరంలో ఉండే నీరు అంతా బయటకు పోతుంది. సన్నగా మారుతారు.
3. ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ తిప్పతీగ పొడి, అర టీస్పూన్ త్రిఫల చూర్ణం కలిపి 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. తరువాత ఆ నీటిని వడకట్టి అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా ఉండగానే తాగేయాలి. దీన్ని రోజూ పరగడుపునే తాగాలి. తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోరాదు. ఇలా చేస్తుంటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గుతారు.
4. నువ్వులతో కారంపొడి తయారు చేసుకుని రోజూ అన్నం మొదటి ముద్దలో రెండు పూటలా తింటుండాలి. దీంతో శరీరంలోని కొవ్వు కరుగుతుంది. చెడు నీరంతా బయటకు పోతుంది.
5. ఒక కప్పు పెరుగులో 50 ఎంఎల్ కాకరకాయ రసం కలిపి రోజూ పరగడుపునే తాగుతుండాలి. శరీరంలోని చెడు నీరు పోయి బరువు తగ్గుతారు.
6. రోజూ చేసే కూరల్లో వాడే సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడాలి. దీంతో శరీరంలోని చెడు నీరు బయటకు పోతుంది. అలాగే ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ కలబంద రసం సేవిస్తున్నా.. అధిక బరువును తగ్గించుకోవచ్చు.