Beauty Tips : సాధారణంగా మనలో చాలా మందికి కొన్ని సార్లు మోకాళ్లు, మోచేతుల వద్ద నల్లగా మారుతుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కారణాలు ఏమున్నప్పటికీ ఇలా మోచేతులు, మోకాళ్ల వద్ద నల్లగా అయితే చూసేందుకు బాగుండదు. దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆయా భాగాలు కనబడకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే అలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. దీంతో మోచేతులు, మోకాళ్ల వద్ద నలుపుదనం పోతుంది. ఆయా భాగాలు తిరిగి పూర్వ రూపాన్ని సంతరించుకుంటాయి. మరి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే..
1. ఒక ఆలుగడ్డను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నేరుగా మోచేతులు, మోకాళ్లపై రుద్దవచ్చు. లేదా వాటి రసం తీసి ఆయా భాగాలపై రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తు తప్పక ఫలితం కనిపిస్తుంది.
2. ఒక టీస్పూన్ నిమ్మకాయ రసంలో కాస్త ఉప్పు, చక్కెర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నలుపుదనం ఉన్న చోటల్లా రాయాలి. ఒక గంట సేపు అయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే చర్మం నలుపుదనం పోయి తెల్లగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. అన్ని రకాల మచ్చలు పోతాయి.
3. కాస్తంత రోజ్ వాటర్‌లో కొద్దిగా శనగపిండి వేసి కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని నల్లగా ఉన్న మోచేతులు, మోకాళ్లపై రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి కడిగేయాలి. 7 నుంచి 10 రోజుల పాటు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
4. ఒక టీస్పూన్ బొప్పాయిరసం, అంతే మొత్తంలో తేనె తీసుకుని బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని రాస్తుంటే మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపుదనం పోతుంది. తిరిగి పూర్వ రూపం వస్తుంది. చర్మం కాంతింవంగా మారి మృదువుగా అవుతుంది.