Thyroid : ప్రస్తుత తరుణంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపర్ థైరాయిడిజం. రెండోది హైపో థైరాయిడిజం. మొదటి దాంట్లో బరువును వేగంగా కోల్పోతారు. రెండో రకం థైరాయిడ్ ఉంటే.. బరువు బాగా పెరుగుతారు. ఇక కొన్ని లక్షణాలు రెండు థైరాయిడ్‌లలోనూ కామన్‌గా ఉంటాయి. కానీ ఏ థైరాయిడ్ సమస్య వచ్చినా సరే.. జీవితాంతం మందులను వాడాల్సి ఉంటుంది. దీంతో సరైన డోసు లభించక థైరాయిడ్ సమస్య ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది.

అయితే థైరాయిడ్ సమస్యకు కాపర్ వాటర్ సరైన పరిష్కారం అని చెప్పవచ్చు. రాగి పాత్రలో ఉంచిన నీళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. రోజూ రాత్రి ఒక లీటర్ నీటిని రాగి పాత్రలో పోసి అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం బ్రష్ చేసిన వెంటనే ఆ రాగి పాత్రలో నిల్వ ఉంచిన లీటర్ నీరు మొత్తం తాగాలి. ఒకేసారి తాగలేకపోతే.. కొంచెం కొంచెం నీళ్లను నెమ్మదిగా తాగవచ్చు. ఇలా క్రమం తప్పకుండా రోజూ రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను తాగడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. ఎలాంటి థైరాయిడ్ సమస్య ఉన్నా సరే కొద్ది రోజులకు ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ శరీరానికి కావల్సినంత లభిస్తుంది. దీంతో థైరాయిడ్ హార్మోన్లలో హెచ్చు తగ్గులు ఉండవు. హైపో, హైపర్.. రెండు రకాల థైరాయిడ్‌ల నుంచి బయట పడవచ్చు.
రాగి నీళ్లలో అనేక అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. కేవలం థైరాయిడ్ మాత్రమే కాకుండా పలు ఇతర వ్యాధుల నుంచి కూడా ఇవి మనల్ని బయట పడేస్తాయి. అందువల్ల రోజూ ఉదయాన్నే పరగడుపునే ఎవరైనా సరే రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను తాగితే మేలు జరుగుతుంది. రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరంలోని సూక్ష్మ క్రిములు చనిపోతాయి. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా.. వాటి వల్ల జ్వరాలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఇక రాగి నీళ్లను తాగడం వల్ల మలబద్దకం, విరేచనాలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, కడుపులో మంట కూడా తగ్గుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గౌట్ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. ఇలా రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటితో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.