Ashwagandha With Milk : మన శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాలలో పాలు ఒకటి. పాలను తాగడం వల్ల మన శరీరానికి కలిగే లాభాల గురించి మనందరికీ తెలుసు. పిల్లల ఎదుగుదలకు, ఎముకలు దృఢంగా ఉండడానికి అవసరమైన కాల్షియం పాలల్లో ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ పాలల్లో ఉంటాయి. మనలో చాలా మంది పాలను ప్రతిరోజూ తాగుతూ ఉంటారు. పిల్లలకు కూడా పాలను ప్రతిరోజూ ఆహారంగా ఇస్తూ ఉంటారు. మనలో చాలా మంది పాలను ఎక్కువగా రాత్రిపూట తాగుతూ ఉంటారు. ముఖ్యంగా మగ వారు రాత్రి పూట పాలను తాగడం వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుందని, దీంతో రతిలో చురుకుగా పాల్గొనవచ్చని అందుకే మొదటి రాత్రి నాడు గదిలో పాలను ఉంచుతారనే అభిప్రాయం మనలో చాలా మందికి ఉంది. కానీ ఇదంతా అపోహ మాత్రమే అని నిపుణులు అంటున్నారు.
పాలకు టెస్టోస్టిరాన్ హార్మోన్ ను ఎక్కువగా విడుదలయ్యేలా చేసే శక్తి లేదని, ఎటువంటి పరిశోధనలల్లో కూడా ఇది నిరూపించబడలేదని వారు చెబుతున్నారు. అయితే పాలలో రాత్రి పూట అశ్వగంధ చూర్ణాన్ని కలుపుకుని తాగితే మేలు జరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణం కలిపి తాగితే.. ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
అశ్వగంధ చూర్ణాన్ని రాత్రి పూట పాలలో కలిపి తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పురుషులకు బాగా మేలు జరుగుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు. వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి. ఇక అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోవడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.