Fat Cysts : మనం శరీరంలో ఏదో ఒక చోట కొవ్వు అధికమై గడ్డల రూపంలో బయటకు వస్తుంది. వీటినే కొవ్వు గడ్డలు అంటారు. ఈ సమస్యతో బాధపడే వారు చాలా మందే ఉన్నారు. ఈ కొవ్వు గడ్డలు చూడడానికి ఉబ్బెత్తుగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎక్కడపడితే అక్కడ వస్తుంటాయి. ఇవి చూడడానికి అందవిహీనంగా ఉంటాయి. కొందరిలో ఇవి నొప్పిని కూడా కలిగిస్తాయి. ఇవే కాకుండా కొందరు సెగ గడ్డలతో కూడా బాధపడుతూ ఉంటారు. సెగ గడ్డలు ఎక్కువగా చంకలు, గజ్జలు, చేతులు, కాళ్లపై వస్తూ ఉంటాయి.
ఈ సెగ గడ్డలు ముదిరిన తరువాత చీము కారుతూ దుర్వాసనను వెదజల్లుతూ ఉంటాయి. వైద్యులు ఆపరేషన్ చేసి ఈ గడ్డలను తొలగిస్తారు. కొవ్వుగడ్డలను, సెగ గడ్డలను ఆపరేషన్ తో పని లేకుండా కూడా నయం చేసుకోవచ్చు. ఆపరేషన్ తో పని లేకుండా ఆయుర్వేదం ద్వారా మనం ఈ గడ్డలను తొలగించుకోవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అతిబల మొక్కను ఉపయోగించి మనం ఈ గడ్డలను నయం చేసుకోవచ్చు.
ఈ మొక్క మనందరికీ తెలిసినప్పటికి దీనిలో ఉండే ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియదు. ఈ అతిబల మొక్క మనకు వచ్చే కొవ్వు, సెగ గడ్డలను నయం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మొక్కను ఉపయోగించి కొవ్వు, సెగ గడ్డలను ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బాగా ముదిరిన అతిబల మొక్క ఆకులను తీసుకుని వాటికి ఆముదం నూనెను లేదా నువ్వుల నూనెను రాసి నిప్పులపై వేడి చేయాలి. ఇలా వేడి చేసిన ఆకులు గోరు వెచ్చగా ఉన్నప్పుడే కొవ్వు, సెగ గడ్డలపై ఉంచి రాత్రి పడుకునే ముందు కట్టుగా కట్టి ఉదయాన్నే తీసివేయాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల కొవ్వు, సెగ గడ్డలు తగ్గుతాయి. ఎటువంటి మందులతోనూ, ఆపరేషన్ తోనూ పని లేకుండా చాలా తక్కువ ఖర్చుతోనే ఈ కొవ్వు గడ్డలను, సెగ గడ్డలను తగ్గించుకోవచ్చు.