Garlic : మనలో చాలా మంది అనేక రకాల దంతాల సమస్యలతో బాధపడుతున్నారు. మనల్ని వేధిస్తున్న దంతాల సమస్యలలో దంతాలు గార పట్టడం కూడా ఒకటి. దీని వల్ల వారు చక్కగా నవ్వలేక ఇబ్బంది పడుతుంటారు. కాఫీ, టీ, శీతల పానీయాలను అధికంగా తాగడం వల్ల, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి. అంతేకాకుండా మనలో చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నారు.
మాంసాహారాన్ని అధికంగా తినడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య వస్తుంది. అలాగే నీటిని తక్కువగా తాగడం కూడా ఈ సమస్యకు మరో కారణం. ప్రతి పది మందిలో ముగ్గురు లేదా నలుగురు ఈ సమస్యలతో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆయుర్వేదం ద్వారా మనం ఈ సమస్యల నుండి చాలా సులువుగా బయటపడవచ్చు. ఈ రెండు సమస్యల నుండి ఒకేసారి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దంతాలకు పట్టిన గారను, నోటి దుర్వాసనను తగ్గించడంలో మనకు వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి కోసం పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో తగినంత రాళ్ల ఉప్పును, కొద్దిగా బేకింగ్ సోడాను, అలాగే మనం ఇంట్లో వాడే టూత్ పేస్ట్ ను కొద్దిగా వేసి బాగా కలిపి వీటన్నింటిని ఒక టూత్ పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంతో ప్రతి రోజూ ఉదయం, రాత్రి రెండూ పూటలా దంతాలను శుభ్రం చేసుకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారడమే కాకుండా నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలను ఉపయోగించి మనం తెల్లని దంతాలను, చక్కని చిరునవ్వును సొంతం చేసుకోవచ్చు.