మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం వంటివి చేయడం ఎంత అవసరమో.. శరీరాన్ని శుభ్రంగా, ఏ వ్యాధులు రాకుండా ఉంచేందుకు నిత్యం స్నానం చేయడం అంతే అవసరం. అందులో భాగంగానే ప్రతి రోజూ మనం స్నానం చేయాల్సి ఉంటుంది. కొందరు రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు. కొందరు ఒక్కసారే స్నానం చేస్తారు. అయితే స్నానానికి ఉపయోగించే నీటిని బట్టి మనకు కలిగే పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. అంటే.. చల్లని నీటితో, వేడి నీటితో స్నానం చేస్తే ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చల్లనినీరు
* చల్లనినీటితో స్నానం చేయడం వల్ల జలుబు రాకుండా ఉంటుంది.
* చర్మం దృఢంగా మారుతుంది.
* ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరం రిలాక్స్ అవుతుంది.
* శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
* శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
వేడి నీరు
* వేడి నీటితో స్నానం చేయడం వల్ల అలసట తగ్గుతుంది. శరీరానికి హాయి లభిస్తుంది.
* తలనొప్పి తగ్గుతుంది.
* కండరాలు రిలాక్స్ అవుతాయి. నొప్పులు తగ్గుతాయి.
* ముక్కు దిబ్బడ సమస్య తగ్గుతుంది.
* చర్మ రంధ్రాలు తెరుచుకుని చర్మం శుభ్రంగా మారుతుంది.