Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home యోగా

వ‌క్రాసనం ఎలా వేయాలి ? దాని వ‌ల్ల క‌లిగే లాభాలు..!

Admin by Admin
February 26, 2021
in యోగా
Share on FacebookShare on Twitter

సాధార‌ణంగా ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేసేవారు అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. శారీర‌క శ్ర‌మ ఉండ‌దు క‌నుక వీరు అధికంగా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. పురుషుల్లో అయితే పొట్ట బాగా పెరుగుతుంది. అదే స్త్రీల‌లో అయితే పొట్ట‌, తొడ‌లు, పిరుదుల వ‌ద్ద కొవ్వు బాగా పేరుకుపోతుంది. దీంతో అధిక బ‌రువు పెరుగుతారు. అయితే ఇలాంటి వారు వ‌క్రాస‌నాన్ని త‌ర‌చూ వేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఈ ఆస‌నం ఎలా వేయాలి, ఇంకా ఏమేం లాభాలు క‌లుగుతాయి.. అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

how to do vakrasana and its benefits in telugu
Source: cntraveller

వ‌క్రాసనం వేసే విధానం

కాళ్ల‌ను ముందుకు చాపి వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవాలి. ఆ త‌రువాత కుడి కాలిని మ‌డిచి ఎడ‌మ మోకాలికి ఆనించాలి. ఎడ‌మ‌కాలిని నిటారుగానే ఉంచాలి. శ‌రీరాన్ని నెమ్మ‌దిగా కుడి వైపుకు తిప్పాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడ‌మ చేత్తో కుడి మోకాలిని పొట్ట వైపు నెడుతూ ఎడ‌మ మోకాలిని ప‌ట్టుకోవాలి. చిత్రంలో చూపిన విధంగా కుడి చేతిని న‌డుము వెనుక వైపు నేల‌పై ఆనించాలి. మెడ‌ను వెన‌క్కి తిప్పి వీలైనంత‌గా శ‌రీరాన్ని నిటారుగా ఉంచాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి. ఆ త‌రువాత విశ్రాంత స్థితిలోకి రావాలి. ఇలా క‌నీసం 10 సెక‌న్ల పాటు ఉండాలి. రోజూ ఈ ఆసనం వేస్తూ స‌మ‌యాన్ని నిమిషం వ‌ర‌కు పెంచ‌వ‌చ్చు. దీంతో ఫ‌లితం ఉంటుంది.

వ‌క్రాస‌నం లాభాలు

* వ‌క్రాస‌నంను నిత్యం వేయ‌డం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కరుగుతుంది.

* అధిక బ‌రువు త‌గ్గుతారు.

* న‌డుము, పిరుదుల దగ్గ‌ర అన‌వ‌స‌రంగా ఉండే కొవ్వు క‌రుగుతుంది.

* వెన్ను దృఢంగా మారుతుంది.

* కండ‌రాలు ఆరోగ్యంగా ఉంటాయి.

* గ్యాస్ స‌మ‌స్య ఉండ‌వు. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది.

* డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

* శ‌రీర ఆకృతి స‌రిగ్గా ఉంటుంది.

సూచ‌న‌

గ‌ర్భిణీలు, న‌డుముకు శ‌స్త్ర చికిత్సలు చేయించుకున్న వారు ఈ ఆస‌నాన్ని వేయ‌రాదు.

Tags: how to do vakrasanavakrasanavakrasana benefitsvakrasana usesవక్రాసనంవక్రాసనం ఉప‌యోగాలువక్రాసనం ప్ర‌యోజ‌నాలువక్రాసనం లాభాలువక్రాసనం వేసే విధానం
Previous Post

రుచిక‌ర‌మైన మొక్క‌జొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్‌.. ఇలా చేసుకోండి..!

Next Post

కొబ్బ‌రినీళ్ల‌ను ఏ స‌మ‌యంలో తాగితే మంచిది ?

Related Posts

యోగా

ధ్యానం వల్ల కలిగే 7 అద్భుత‌మైన‌ ప్రయోజనాలు

June 25, 2025
యోగా

ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే…3 శ్వాస వ్యాయామాలు..

June 20, 2025
యోగా

ఆఫీసులో కుదిరితే ఈ చిన్న‌పాటి యోగాస‌నాలు వేయండి.. ఎంతో ఫ‌లితం ఉంటుంది..

June 17, 2025
యోగా

హైబీపీ ఉన్న‌వారు ఈ ఆస‌నాల‌ను వేస్తే ఎంతో ఫ‌లితం ఉంటుంది..!

June 16, 2025
యోగా

ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ యోగాస‌నాల‌ను వేయండి..

May 31, 2025
యోగా

థైరాయిడ్ గ్రంధుల పనితీరు మెరుగుపరిచే ప్రాణ ముద్ర..!

May 23, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.