బీపీ ప్రస్తుతం కాలంలో సాధారణమైన సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లలు సైతం బీపీతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి, ఆహారం. రక్తపోటును నియంత్రించాలన్నా సరే ఇవే ముఖ్యం. సరైన జీవనశైలి, ఆహార వ్యవహారాల ద్వారా బీపీని త్వరగా నియంత్రించవచ్చు. దాంతో పాటుగా కొన్ని యోగాసనాల ద్వారా కూడా బీపీని తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. సరిగ్గా సాధన చేయడం ద్వారా యోగాసనాలు దివ్యౌషధంలా పనిచేస్తాయని, వాటిని సరైన సమయంలో సరైన క్రమంలో సాధన చేయడం ద్వారా అనేక రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా బీసీని తగ్గించడానికి మూడంటే మూడు రకాల యోగాసానాలు సాధన చేస్తే సరిపోతోందని చెప్తున్నారు. రక్తపోటు అధికమైన, తక్కువ అయినా ప్రమాదం తప్పదని, ఎప్పడూ దానిని నియంత్రణలో ఉంచుకోవడమే మంచిదని వైద్యులు చెప్పారు. ఇంతకీ బీపీని నియంత్రించే యోగాసనాలు ఏంటో.. వాటిని ఎలా వేయాలో తెలుసా..
ముందుగా చేతులు కట్టుకుని నిలబడాలి. తర్వాత కాళ్ళును వెడల్పు చేసి చీలమండపై బరువుతో కూర్చోవాలి. ఈ అసనంలో చీలమండను ఏ విధంగానూ కదల్చకూడదు. మోకాళ్లపై వీలైనంత బరువు ఉండాలి. ఆసనం వేయడంలో ఇబ్బందిగా ఉంటే.. గోడ మద్దతును తీసుకోవచ్చు. ఈ యోగా అసనాల ద్వారా హిప్ కండరాల ఫ్లెక్సబ్బులిటీ లభిస్తుంది. బ్యాక్ స్ట్రాంగ్ గా మారడానికి, జీర్ణ వ్యవస్థ మెరుగవడానికి ఈ అసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. మలాసం మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పెల్విక్ కండరాలను బలోపేతం చేస్తుంది. నార్మల్ ప్రసవం కోసం మహిళలు ఈ యోగ ఆసనాన్ని ఎంచుకోవచ్చు. PCOS నిర్వహణలో కూడా సహాయపడుతుంది.
మీ పాదాలను హిప్ వెడల్పుతో వేరుగా ఉంచి నిలబడండి. మీ చేతులను మీ వైపులా, అరచేతులను మీ తొడలపై ఉంచండి. మీ వెన్నెముక నిటారుగా పెట్టండి. మీ ఛాతీని పైకి ఎత్తండి. మీ దృష్టిని ఒక పాయింట్‌పై కేంద్రీకరించండి. నెమ్మదిగా మీ పాదాలను భూమిలోకి నొక్కండి, మీ తొడలను పైకి ఎత్తండి. మీ మడమలను నేల నుండి ఎత్తండి, కాలి వేళ్ల మీద నిలబడండి. మీ చేతులను పైకి లేపండి, అరచేతులు ఒకదానికొకటి ఎదురుగా పైకి లేపాలి. మీ మెడను ఎత్తుగా ఉంచండి. మీ చూపులను పైకి కేంద్రీకరించండి. ఈ భంగిమలో 5-10 లోతైన శ్వాసలను తీసుకోండి. నెమ్మదిగా మీ మడమలను నేలపైకి తీసుకురండి. మీ కాళ్ళను నిటారుగా ఉంచండి. మీ చేతులను మీ వైపునకు తీసుకురండి.
తాడాసన భంగిమలో నిటారుగా నిలబడండి. మీ పాదాలు నడుమ వెడల్పులో ఉంచాలి. మీ చేతులు మీ శరీరానికి ఇరువైపులా ఉండాలి. మీ కుడి కాలును నెమ్మదిగా వంచుతూ ఎడమ తొడ లోపలి భాగంవైపు తీసుకెళ్లాలి. మీ పాదాల అరికాళ్ళు నేలపై చదునుగా ఉండాలి. మడమలు నేల నుండి వీలైనంత ఎత్తులో ఉండాలి. మీ ఎడమ కాలు నిటారుగా ఉంచండి. మీ శరీరాన్ని సమతుల్యం చేయండి. తర్వాత మీ రెండు చేతులను మీ తలపైకి నిటారుగా ఉంచండి. నమస్కార్ ముద్రను చేయండి. కొంత సమయం పాటు ఈ భంగిమలో ఉండండి. మీ దృష్టిని ఒక పాయింట్‌పై స్థిరంగా ఉంచండి. లోతైన శ్వాస తీసుకోండి. మీ చేతులను నెమ్మదిగా కిందికి దించి, మీ కుడి పాదాన్ని నేలపైకి తీసుకుని తాడాసన భంగిమలోకి రండి. రెండో కాలి ద్వారా కూడా అదే విధానాన్ని పునరావృతం చేయండి.