Curry Leaves Plant : మనలో చాలా మంది ఎంతో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారీ మనం సంపాదించే డబ్బు ఒక్కసారిగా ఆగిపోతుంది. దీంతో మనం ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మనం ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడలేకపోతుంటాం. అలాంటప్పుడు మన ఇంట్లో ఈ ఒక మొక్కను పెంచుకుంటే చాలు మన ఆర్థిక సమస్యలు అన్నింటి నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు బాగా సంపాదించి ఇప్పుడు ఎటువంటి ఆదాయం లేని వారు వారి ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కను పెంచుకోవాలి. ఈ కరివేపాకు మొక్క పెరుగుతూ ఉంటే క్రమక్రమంగా వారి ఆదాయం కూడా పెరుగుతుందట.
మన పూర్వీకులు ఇంటికొక కరివేపాకు చెట్టును పెంచుకోవాలని చెప్పేవారు. ఇలా కరివేపాకు చెట్టును పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లో పాడి పంటలు సమృద్దిగా ఉండడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుందట. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, ఉద్యోగం పోయి బాధపడుతున్న వారు వారి ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కను పెంచుకోవడం వల్ల వారి ఆదాయం పెరుగుతుంది. కేవలం ఆదాయం పెంచే మొక్కగానే కాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కగా కూడా కరివేపాకు మనకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను విరివిరిగా ఉపయోగిస్తారు. కరివేపాకు మొక్కను ఉపయోగించడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

కరివేపాకు విష వాయువులను గ్రహించి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది. గాలి ద్వారా సోకే వ్యాధులను కూడా కరివేపాకు మన దరి చేరకుండా చేస్తుంది. మన ఇంట్లో కనుక కరివేపాకు చెట్టు, తులసి చెట్టు, కలబంద చెట్టు ఉంటే వాతావరణ మార్పుల వల్ల వచ్చే రోగాల బారిన పడకుండా ఉంటాం. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట ఈ చెట్టును పెంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా కరివేపాకులో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. కరివేపాకు ముదురు ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కరివేపాకును మనం ఐదు రకాలుగా తీసుకోవచ్చు. కరివేపాకు ఆకుల రసాన్ని రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు లేదా ఈ ఆకుల రసాన్ని 4 టీ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి కలిపి తాగవచ్చు లేదా గుప్పెడు కరివేపాకు ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయంగా చేసుకుని తాగవచ్చు లేదా ఉదయం పరగడుపున నాలుగు కరివేపాకు ఆకులను తినవచ్చు లేదా 20 కరివేపాకు ఆకులను సేకరించి దానికి అల్లాన్ని, నిమ్మరసాన్ని, కొద్దిగా నీటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమానికి ఒక గ్లాస్ నీటిని కలిపి వడకట్టి తాగాలి.
ఈ ఐదు విధాలలో ఏవిధంగా తీసుకున్నా కూడా మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన శరీరం వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటుంది. కరివేపాకుతో కారాన్ని చేసుకుని రోజూ మొదటి ముద్దలో తింటే చక్కని ప్రయోజనాన్ని పొందవచ్చు. అధిక చెమటతో బాధపడే వారు కరివేపాకును తీసుకోవడం వల్ల అధిక చెమట సమస్య తగ్గుతుంది. మజ్జిగలో కరివేపాకు ఆకుల రసాన్ని కలుపుకుని తాగడం వల్ల చెమట పట్టడం వల్ల శరీరం నుండి వచ్చే దుర్వాసన రాకుండా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో అధిక వేడి కూడా తగ్గుతుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
కరివేపాకు తాజా ఆకులను కళ్ల పై ఉంచుకోవడం వల్ల కళ్ల అలసట తగ్గుతుంది. రెండు టీ స్పూన్ల కరివేపాకు ఆకుల రసంలో ఒక టీ స్పూన్ తేనెను కలిపి పరగడుపున తీసుకుంటూ ఉండడం వల్ల మొలల సమస్య తగ్గుతుంది. మనలో చాలా మంది వంటల్లో వేసే కరివేపాకును తీసి పక్కన పెడుతూ ఉంటారు. అలాంటి వారికి కరివేపాకును పొడిని లేదా రసాన్ని ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి. కరివేపాకును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కరివేపాకు మనకు సహాయపడుతుంది. ఈ విధంగా కరివేపాకు మనకు ఆర్థిక పరంగానూ, ఆరోగ్యపరంగానూ ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్టు తప్పకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.