మనలో చాలా మందికి అప్పుడప్పుడు నెగెటివ్ ఆలోచనలు వస్తుంటాయి. అది సహజమే. దాదాపుగా ప్రతి ఒక్కరికి నెగెటివ్ ఆలోచనలు ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. కొందరైతే రోజూ ఉదయాన్నే నిద్ర లేస్తూనే ఏదో కోల్పోయినట్లు అవుతారు. అసలు అందుకు కారణం కూడా తెలియదు. దిగాలుగా ఉంటారు. ఎప్పుడూ మనస్సులో నెగెటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దీని వల్ల భయం, ఆందోళన కలుగుతుంటాయి. నెగెటివ్ ఆలోచనల వల్ల మానసిక ఆరోగ్యం మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. అందువల్ల ఎవరైనా సరే ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. చుట్టూ పాజిటివ్ వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
నెగెటివ్ ఆలోచనల వల్ల మీ జీవితంలో సంతోషం అనేది లేకుండా పోతుంది. మీ జీవితంపై మీకే విరక్తి కలుగుతుంది. అర్థం లేని జీవితం గడుపుతున్నామని అనిపిస్తుంది. అందువల్ల నెగెటివ్ ఆలోచనల నుంచి బయట పడాలి. లేదంటే మన ఆరోగ్యంపై ఆ ఆలోచనలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
నెగెటివ్ ఆలోచనల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు
- బీపీ పెరుగుతుంది.
- ఎమోషనల్ గా బలహీనంగా మారుతారు.
- గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.
- ఆందోళన, డిప్రెషన్ పెరుగుతాయి.
- షుగర్ లెవల్స్ పెరుగుతాయి. డయాబెటిస్ వస్తుంది.
- శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
- శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి.
- నిద్రలేమి సమస్య వస్తుంది.
- కండరాల నొప్పులు ఉంటాయి.
- ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి.
ప్రతి ఒక్కరూ నెగెటివ్ ఆలోచల నుంచి బయటపడి తమ ఆరోగ్యం దెబ్బ తినకుండా చూసుకోవాలి. లేదంటే ఎల్లప్పుడు నెగెటివ్‌గా ఉండడమే మన అలవాటుగా మారుతుంది. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి.
1. నెగెటివ్ ఆలోచనలు మిమ్మల్ని చుట్టు ముట్టినప్పుడు మీ బలం ఏమిటో మీరు ఆలోచించాలి. దానిపైనే దృష్టి పెట్టాలి. మీ గురించి మీరు ఆలోచించాలి. మీరు ఎందులో బలవంతులో ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. దీంతో నెగెటివ్ ఆలోచనలు ఆటోమేటిగ్గా తగ్గుతాయి.
2. ఇతరుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. అంటే వారు చేసిన సహాయాన్ని మరువరాదు. ఇది మీలో సంతోషాన్ని పెంచుతుంది. మూడ్‌ను మారుస్తుంది. ఆనందంగా ఉండేలా చేస్తుంది.
3. కొందరు తమను ఇతరులతో పోల్చి చూసుకుని తమను తాము తక్కువగా భావిస్తుంటారు. ఈ తరహా పద్ధతి మార్చుకోవాలి. ఇతరులతో మనల్ని మనం ఎప్పుడూ పోల్చుకోకూడదు. ఇది నెగెటివ్ ఆలోచనలకు దారి తీస్తుంది. మనకు లభించిన దాంట్లోనే సంతృప్తిగా ఉండాలి. ఇతరులతో పోలిక పనికిరాదు.
4. మెడిటేషన్ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నెగెటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి. సంతోషంగా ఉంటారు. నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. తేలిగ్గా ఉండేలా చేస్తుంది. ఆందోళన, డిప్రెషన్‌లను తగ్గించుకునేందుకు మెడిటేషన్ అద్భుతమైన సాధనంగా కూడా పనిచేస్తుంది.
5. నెగెటివ్ ఆలోచనలను మెదడులోకి రానీయకూడదు. గతాన్ని మర్చిపోవాలి. భవిష్యత్తు గురించి ఇప్పుడే బెంగ పడాల్సిన పనిలేదు. వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. ఇప్పుడేం చేయాలి ? అనేది ఆలోచించాలి. అంతే కానీ గతాన్ని తలుచుకుని బాధపడకూదు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందరాదు. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఆలోచనలను తగ్గించుకుని మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. డిప్రెషన్, ఆందోళన రాకుండా ఉంటాయి.