Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Walking : రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Editor by Editor
September 12, 2022
in వార్త‌లు, వ్యాయామం
Share on FacebookShare on Twitter

Walking : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ఎక్కువ శాతం మంది అధిక బ‌రువుతో ఇబ్బందులు ప‌డుతుండ‌గా.. ఇంకా చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్‌తో అవ‌స్థ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ఇవ‌న్నీ వాస్త‌వానికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా వ‌చ్చేవే. క‌నుక జీవ‌న‌శైలి స‌రిగ్గా ఉంటే.. ఇలాంటి వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అయితే జీవ‌న‌శైలిలో వ్యాయామం కూడా ఒక‌టి. రోజూ వ్యాయామం చేస్తేనే జీవ‌న‌శైలిలో చాలా వ‌ర‌కు ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

అయితే రోజూ భారీ ఎత్తున వ్యాయామం చేయాల్సిన ప‌నిలేదు. క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా చాలు.. అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక రోజూ వాకింగ్ చేస్తే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

keep Walking daily for 30 minutes for these amazing benefits
Walking

వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన ప‌లు నాడులు కాళ్ల‌లో ఉంటాయి. అందుక‌నే కాళ్ల‌తో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

నిత్యం ర‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావంటున్నారు. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి. దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. క‌నుక రోజూ వాకింగ్ చేయాలి.

డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం ర‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. 6 నెల‌ల పాటు వాకింగ్‌, ర‌న్నింగ్ చేసిన కొంద‌రు డ‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. నిత్యం క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. విరేచ‌నం రోజూ సాఫీగా అవుతుంది.

నిత్యం వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయి. నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.

బ్యాక్ పెయిన్‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు. లో (low) ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది. క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది. క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది. నిత్యం వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌. వారు హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. క‌నుక నిత్యం వాకింగ్ చేయాలి. క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఈ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags: walking
Previous Post

Urine Color : మూత్రం రంగు మారిందా.. అయితే ఈ వ్యాధులు ఉన్న‌ట్లే..!

Next Post

Nausea : త‌ల తిరిగిన‌ట్లు.. వికారంగా.. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉంటుందా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.