Ringworm : మనల్ని ఇబ్బందులకు గురి చేసే చర్మ సమస్యల్లో తామర ఒకటి. డెర్మటోఫైట్ అనే ఫంగస్ కారణంగా తామర అనే చర్మ సమస్య వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా వస్తుంది. తామర వచ్చిన చోట చర్మం పై దురద, మంట వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది.వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల, శుభ్రంగా స్నానం చేయడకపోవడం వల్ల ఈ సమస్యయ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. తామర వచ్చిన వారి దుస్తులను ధరించిన, వారి వాడిన వస్తువులను వాడిన, వారితో సన్నిహితంగా మెలిగిన కూడా తామర వచ్చే అవకాశం ఉంది. ఇంటి చిట్కాను ఉపయోగించి ఈ తామరను మనం సులభంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం మనం జిల్లేడు పాలను, వేప నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.
జిల్లేడు మొక్క మనకు రోడ్ల పక్కన, ఖాళీ స్థాలాల్లో విరివిరిగా లభ్యమవుతుంది. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సూక్ష్మ క్రిములను నశింపజేయడంలో ఇవి సమర్థవంతంగా పని చేస్తాయి. ఈ మొక్క ఆకులను తుంచినప్పుడు వాటి నుండి పాలు కారతాయి. ఈ పాలను సేకరించి ఒక గిన్నెలో తీసుకోవాలి. అలాగే వేప నూనెను మరో గిన్నెలో తీసుకోవాలి. వేప నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫంగస్, బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో సహాయపడతాయి. గజ్జి, తామర, దురద, అలర్జీ వంటి వాటితో పాటు మొటిమలను తగ్గించడంలో కూడా వేపనూనె సహాయపడుతుంది.
ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ వేప నూనెను తీసుకోవాలి. తరువాత అందులో మూడు లేదా నాలుగు చుక్కల జిల్లేడు పాలను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తామర ఉన్న చోట రాసి సున్నితంగా మర్దనా చేయాలి. ఈ మిశ్రమాన్ని 3 గంటల పాటు అలాగే ఉంచిన తరువాత కడిగివేయాలి. తరువాత సబ్బుతో కడిగివేయాలి. ఈ చిట్కాను వారానికి మూడు సార్లు మాత్రమే పాటించాలి. ఇలా రెండు వారాల పాటు పాటించడం వల్ల తామర నయం అవుతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే జిల్లేడు పాలను సేకరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ పాలు కళ్లల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.