Acne Remedy : అందంగా కనబడాలని కోరుకోవడంలో తప్పు లేదు. అందంగా కనబడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం. అయినప్పటికి ముఖం పై ఉండే మొటిమలు, మచ్చలు, నలుపుదనం తగ్గక ఇబ్బంది పడుతున్న వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఇలా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు నేటి తరుణంలో ఎక్కువవుతున్నారు. వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, ఎండలో తిరగడం, మారిన జీవన విధానం ఇటువంటి చర్మ సంబంధిత సమస్యలు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు.
మొటిమలు, మచ్చలు, నలుపుదనం తగ్గి ముఖం అందంగా కనబడాలని వివిధ రకాల క్రీములను, ఫేస్ వాష్ లను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. క్రీములు, ఫేస్ వాష్ లు వాడినప్పటికి పొందలేని ఫలితాన్ని మనం ఒక చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించడం వల్ల పొందవచ్చు. చర్మ సమస్యలను తగ్గించి ముఖాన్ని అందంగా మార్చే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం టమాట రసాన్ని, విటమిన్ క్యాప్సుల్స్ ను, కలబంద గుజ్జును ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల టమాట రసాన్ని తీసుకోవాలి. తరువాత అందులో ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ను, ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చల్లగా అయ్యే వరకు ఫ్రిజ్ లో ఉంచాలి. చల్లగా అయిన తరువాత రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఉదయం లేచిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం ఎంత చల్లగా ఉంటే మనం అంత చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ మిశ్రమాన్ని ఒకసారి తయారు చేసుకుని వారం రోజుల పాటు ఉపయోగించవచ్చు.
విటమిన్ ఇ, కలబంద గుజ్జు, టమాటాలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి. ఈ చిట్కాను వాడడం వల్ల ముఖం పై ఉండే మొటిమలు, మచ్చలు, నలుపుదనం తొలిగిపోతుంది. ముఖం రోజంతా కూడా తాజాగా ఉంటుంది. ఖరీదైన క్రీములను, స్క్రబర్ లను వాడినప్పటికి పొందలేని ఫలితాన్ని మనం ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల మనం పొందవచ్చు.