Sadabahar For Hair : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. వాటిల్లో తెల్ల జుట్టు సమస్య కూడా ఒకటి. తెల్ల జుట్టు ఉండడం వల్ల మనిషి మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుంది. తెల్ల జుట్టు ఉందని ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతుంటారు. ఆత్మ స్థైర్యం, ధైర్యం పోతాయి. దీంతో బయటకు వెళ్లలేకపోతుంటారు. నలుగురిలోనూ కలవలేకపోతుంటారు. దీని వల్ల బయటకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. తెల్ల జుట్టు ఉంటే ఎవరూ తలెత్తుకుని తిరగలేరు. ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. ఇక ఈ సమస్య నుంచి బయట పడేందుకు అనేక మంది చాలా మార్గాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా కెమికల్స్‌ను ఎక్కువగా వాడుతారు.
అయితే కెమికల్స్‌ను ఎక్కువగా వాడడం వల్ల అప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుంది. కానీ దాని వల్ల చర్మంపై సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా ఆ కెమికల్స్ మెదడుపై ప్రభావం చూపిస్తాయి. దీంతో ముఖంపై ముడతలు రావడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఇతర అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. కనుక కెమికల్స్‌ను జుట్టుకు వాడడం అంత మంచిది కాదు. అయితే మరి సమస్య నుంచి బయట పడడం ఎలా.. అంటే.. అందుకు ఒక మార్గం ఉంది. అదే బిళ్ల గన్నేరు మొక్క. దీన్ని ఉపయోగించడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది కూడా. ఇక దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బిళ్ల గన్నేరు మొక్కలు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఇవి పింక్, తెలుపు రంగులో ఉండే పూలను పూస్తాయి. అయితే ఏ మొక్క అయినా సరే.. దాని ఆకులను సేకరించి వాటి నుంచి ఒక టీస్పూన్ మోతాదులో రసాన్ని తీయాలి. అలాగే ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి రసం తీయాలి. దీనికి సరైన మోతాదులో కొబ్బరినూనెను కలపాలి. ఇక ఈ మూడింటినీ కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. తరువాత 1 గంట పాటు ఉండాలి.
గంట సేపు అయిన తరువాత ఆయుర్వేదిక్ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీంతోపాటు జుట్టు సమస్యలు కూడా ఉండవు. చుండ్రు తగ్గుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. కనుక తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు ఇకపై దిగులు చెందకుండా ఈ చిట్కాను పాటించాలి. తప్పక ఫలితం కనిపిస్తుంది.