Skin Wrinkles : అవిసె గింజలు.. ఇవి మనందరికి తెలిసినవే. చూసేందుకు చిన్నగా , దోస గింజ ఆకారంలో ఉంటాయి. రుచిలో కూడా ప్రత్యేకంగా లేనప్పటికి ఆరోగ్యంగా మాత్రం ఇది ఒక సూప్ ఫుడ్ అని చెప్పవచ్చు. అవిసె గింజల్లో శరీరానికి మేలు చేసే కొవ్వులతో పాటు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరడచంలో అవిసె గింజలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. స్త్రీలల్లో మోనోపాజ్ దశలో వచ్చే సమస్యలను తగ్గించడంలో కూడా ఈ అవిసె గింజలు మనకు ఎంతో దోహదపడతాయి. ఈ అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తాయి. కేవలం యప ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా అవిసె గింజలు ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజలను ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
చర్మం పై ముడతలు తొలగిపోతాయి. అయితే ఈ అవిసె గింజలను ఎలా ఉపయోగించడం వల్ల మనం అందాన్ని మెరుగుపరుచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అవిసె గింజలతో మనం జెల్ ను తయారు చేసుకుని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ జెల్ ను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఇందులో అర కప్పు అవిసె గింజలను వేసి ఉడికించాలి. ఇలా ఉడికించిన పది నిమిషాల తరువాత నీటిపై కోడిగుడ్డు తెల్లసొన వలె తెల్లగా జెల్ లాగా ఏర్పడుతుంది. ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు అలాగే ఉంచాలి. తరువాత ఈ అవిసె గింజలను వస్త్రంలోకి తీసుకుని చేత్తో పిండగా వచ్చిన జెల్ ను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జెల్ ను గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న జెల్ ను రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే చల్లటి నీటితో కడిగి వేయాలి.
ఇలా చేయడం వల్ల చర్మం యవ్వనంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ జెల్ లో తేనెను కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉండే ముడతలు తొలగిపోతాయి. ఈ జెల్ ను ఉపయోగించడం వల్ల ముఖం పై ఉండే నలుపుదనం తొలగిపోతుంది. మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. అలాగే ఈ జెల్ ను ఎటువంటి చర్మతత్వం ఉన్న వారైనా ఉపయోగించవచ్చు. అలాగే ఇతర ఫేస్ ప్యాక్ లల్లో కూడా ఈ జెల్ ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఉడికించిన ఈ అవిసె గింజలను పడేయకుండా వాటిని పేస్ట్ గా చేసి జుట్టుకు రాసుకోవచ్చు. ఇలా అవిసె గింజలతో తయారు చేసుకున్న జెల్ ను ఉపయోగించడం వల్ల మన చర్మ సమస్యలన్నీ తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.