Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tomato Perugu Pachadi : ట‌మాటా పెరుగు ప‌చ్చ‌డిని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. రుచి అద్భుతంగా ఉంటుంది..

D by D
December 25, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomato Perugu Pachadi : ట‌మాటాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాలు మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో ఎంతో దోహ‌ద‌ప‌డతాయి. ట‌మాటాల‌తో చేసే ఎటువంటి కూరైనా, ప‌చ్చ‌డైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ఎంతో రుచిగా, సుల‌వుగా చేసుకోగ‌లిగే ట‌మాట పెరుగు ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట పెరుగు ప‌చ్చ‌డి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ట‌మాటాలు – పావు కిలో, ప‌చ్చిమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, పెరుగు – అర క‌ప్పు, చింత‌పండు – ఒక చిన్న నిమ్మ‌కాయంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, ఎండుమిర్చి – 2.

Tomato Perugu Pachadi recipe in telugu perfect taste for rice
Tomato Perugu Pachadi

ట‌మాట పెరుగు ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, త‌గినంత ఉప్పు, చింత‌పండు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ట‌మాట ముక్క‌లు చ‌ల్లారిన త‌రువాత వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు, కొత్తిమీర వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈప‌చ్చ‌డిలో ఉండ‌లు లేకుండా చిలికిన పెరుగును వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుస‌లు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి.

ఇలా త‌యారు చేసుకున్న తాళింపును ముందుగా త‌యారు చేసుకున్న ప‌చ్చ‌డిలో వేసుకుని క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట పెరుగు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నం, దోశ‌, ఉప్మా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ట‌మాటాల‌తో త‌ర‌చూ చేసే ప‌చ్చ‌ళ్ల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ట‌మాట పెరుగు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ట‌మాట పెరుగు ప‌చ్చ‌డిని విడిచి పెట్టకుండా అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Tomato Perugu Pachadi
Previous Post

Skin Wrinkles : దీన్ని ముఖానికి రాస్తే.. ముడ‌త‌ల‌న్నీ త‌గ్గిపోతాయి.. అందంగా క‌నిపిస్తారు..

Next Post

Potato Peels : బంగాళాదుంప‌ల పొట్టు తీస్తే ఇక‌పై ప‌డేయ‌కండి.. ఎందుకో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025
ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.