Tamarind Seeds : చింత చెట్టును భారత దేశపు ఖర్జూర చెట్టు అంటారని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. చింతపండును, చింతకాయలను మనం విరివిరిగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. చింతపండును తీసుకోవడం వల్ల చక్కటి రుచితో పాటు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ చింతపండును సేకరించేటప్పుడు చింతగింజలు రావడం సహజం. ఈ చింతగింజలను చాలా మంది పడేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఈ చింత గింజలను సక్రమంగా ఉపయోగిస్తారు. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చింతగింజల్లో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. చింత గింజల్లో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే వీటిని వాడడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చింతగింజలు చక్కటి ఔషధమనే చెప్పవచ్చు. చింతగింజలను తీసుకుని దోరగా వేయించాలి. తరువాత వీటిని నీటిలో వేసి రెండు రోజుల పాటు నానబెట్టాలి. అయితే ఈ నీటిని రోజుకు రెండు సార్లు మారుస్తూ ఉండాలి. ఇలా నానబెట్టిన తరువాత చింతగింజలపై ఉండే పొట్టును తీసేయాలి. మిగిలిన తెల్లటి గింజలను ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టాలి. తరువాత ఈ గింజలను జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని పూటకు అర టీ స్పూన్ మోతాదులో పాలల్లో లేదా నీళ్లల్లో కలిపి తీసుకోవాలి. నేరుగా తినగలిగిన వారు ఈ పొడిని నెయ్యితో లేదా పటిక బెల్లంతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. చింతగింజల పొడిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి.
కీళ్ల మధ్య అరిగిపోయిన గుజ్జు కూడా మరలా తయారవుతుంది. దీంతో కీళ్ల నొప్పుల నుండి శాశ్వతంగా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని ఆవుపాలల్లో ఒక టీ స్పూన్ చింతగింజల పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలు తగ్గుతాయి. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఇలా తయారు చేసుకున్న చింత గింజల పొడితో కేవలం కీళ్ల నొప్పులనే కాకుండా డయేరియా, చర్మ సంబంధిత సమస్యలు, అజీర్తి, దంత సమస్యలు వంటి ఇతర సమస్యలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. ఈవిధంగా తయారు చేసిన చింత గింజల పొడితో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలపై గార తొలగిపోతుంది. దంతాల సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఈ చింతగింజల పొడిని వేసి కలపాలి. ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల మౌత్ వాష్ గా ఉపయోగపడడంతో పాటు గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. కొన్ని చింత గింజలను నోటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ చింతగింజలను పైన ఉండే ఎర్ర పొట్టుతో సహా జార్ లో వేసి జ్యూస్ లాగా చేసుకుని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల డయేరియా తగ్గడంతో పాటు అజీర్తి సమస్య నుండి కూడా బయటపడవచ్చు. చింతగింజలను వాడడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కూడా మనకు చింతగింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. గుండె జబ్బులు రాకుండా చేయడంలో, బీపీని నియంత్రించడంలో కూడా ఈ గింజలు మనకు దోహదపడతాయి.
ఎముకలు విరిగిన చోట ఈ గింజల పొడిని పేస్ట్ లాగా చేసి రోజూ రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎముకలు త్వరగా అతుకుంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు చింతగింజల పొడిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చర్మ సమస్యలను తగ్గించడంలో, మూత్రాశయ ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో, వివిధ రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా చేయడంలో కూడా ఈ చింతగింజలు మనకు ఉపయోగపడతాయి. ఈ విధంగా చింతగింజలు మనకు మేలు చేస్తాయని వీటిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.