Sitting In Sun Light : చలికాలంలో చాలా మంది ఉదయం పూట ఎండలో కూర్చుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. చలికాలం ఎండు శరీరానికి ఎక్కువగా ఇబ్బందిని కలిగించదని, ఎండలో కూర్చుంటే శరీరానికి విటమిన్ డి అందుతుందని చాలా మంది ఎండలో కూర్చుంటూ ఉంటారు. ఆరోగ్యానికి, విటమిన్ డి కి, రక్షణ వ్యవస్థకు, చలి నుండి కాపాడుకోవడానికి చలికాలం ఎండలో కూర్చోవడం మంచిదే. చలి తగ్గడానికి అలాగే శరీరానికి విటమిన్ డి అందడానికి ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండ బాగుంటుంది. అయితే ఎండలో కూర్చోవడం మంచిదే అయినప్పటికి దీని వల్ల మరో కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇలా ఎండలో కూర్చోవడం వల్ల ముఖం మీద పిగ్మేంటేషన్ వచ్చే అవకాశం ఉంది.
ఈ సమస్య చాలా మందిలో వచ్చే అవకాశం ఉంది. చలికాలంలో ఎండలో కూర్చోవడం వల్ల ముక్కు మీద, బుగ్గల మీద, నుదుటి మీద నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది. చలికాలంలో ఎండలో కూర్చోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండలో కూర్చోవడం వల్ల చర్మంలో ఉండే మెలనిన్ అనే నల్లటి పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఇలా మచ్చల రూపంలో బయటకు వస్తుంది. సూర్యకిరణాలు చర్మం లోపలికి రాకుండా చర్మం నలుపును ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. నలుపు ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే సూర్య కిరణాలు అంత ఎక్కువగా లోపలికి వెళ్లకుండా ఉంటుంది. చలికాలంలో ఎండలో కూర్చున్నప్పటికి ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే నేరుగా ముఖం మీద ఎండ పడకుండా కూర్చోవాలి. వీపుకు ఎక్కువగా తగిలేలా కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వల్ల ముఖం మీద పిగ్మేంటేషన్ రాకుండా ఉంటుంది.
శరీరం ముందు భాగం కూడా ఎండ తగలాలి అయినా ముఖం పై మచ్చలు రాకుండా ఉండాలంటే టోపిని ధరించాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద ఎండపడకుండా ఉంటుంది. అలాగే శరీరం ముందు భాగాలకు ఎండ తగులుతుంది. అలాగే చలికాలంలో ఎండలో కూర్చునేటప్పుడు నీటిని ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా త్రాగకపోతే చర్మం తనని తాను ఎండ నుండి రక్షించుకోలేదు. కనుక చలికాలం అయినప్పటికి 4 లీటర్ల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల కూడా ముఖంపై మచ్చలు రాకుండా ఉంటాయి. విటమిన్ డి లోపంతో బాధపడే వారు చలికాలంలో ఎక్కువగా ఎండలో కూర్చోవడం మంచిది. చాలా వరకు ఈ విటమిన్ డి లోపాన్ని మనం చలికాలంలోనే తగ్గించుకోవచ్చు. పైన చెప్పిన విధంగా ఎండలో కూర్చోవడం వల్ల మనం ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. చలి నుండి కాపాడుకోవచ్చు. అలాగే పిగ్మేంటేషన్ బారిన కూడా పడకుండా ఉండవచ్చు.