Ear Piercing : భారతదేశంలో హిందువులే కాదు.. పలు ఇతర వర్గాలకు చెందిన వారు కూడా ఎంతో పురాతన కాలం నుంచే చెవులు కుట్టించుకోవడం అనే ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. దీన్నే కర్ణ వేద అని కూడా అంటారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు నిర్వహించే 16 రకాల సంస్కారాల్లో చెవులు కుట్టించుకోవడం కూడా ఒకటి. పురాణాల్లోనే కాదు.. ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. చెవులు కుట్టించుకోవడం అనేది పురాణాల ప్రకారం పాటించాల్సిన ఆచారమే అయినప్పటికీ.. ఆయుర్వేదం వల్ల దీంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా చెవులు కుట్టించుకోవడం వల్ల పలు వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
బిడ్డ పుట్టిన రోజు నుంచి 10, 12, 16వ రోజులలో లేదా 6, 7, 8వ నెలలలో లేదా వయస్సు బేసి సంఖ్య వచ్చే సంవత్సరంలో చెవులు కుట్టిస్తారు. అయితే పురాతన కాలంలో స్త్రీలు, పురుషులు అందరికీ చెవులు కుట్టేవారు. కానీ తరువాత కేవలం దీన్ని స్త్రీలకే పరిమితం చేశారు. కానీ ఎవరైనా సరే చెవులను కుట్టించుకోవాలి. ఇక చెవులను కుట్టేందుకు సోమ, బుధ, గురు, శుక్ర వారాలను మంచి రోజులుగా భావిస్తారు. దీని గురించి ఆయుర్వేదంలో వివరించారు. ఇక పురుషులకు అయితే ముందుగా కుడి చెవి కుట్టి తరువాత ఎడమ చెవిని కుడతారు. అదే స్త్రీలకు అయితే ముందుగా ఎడమ చెవిని కుట్టి తరువాత కుడి చెవిని కుడతారు. ఈ విధంగా చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహిస్తారు.
అయితే చెవులను కుట్టడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే చెవుల దగ్గర ఉండే కొన్ని రకాల నాడులు చెవులు కుట్టడం వల్ల ఉత్తేజం అవుతాయి. దీంతో పలు ప్రయోజనాలను పొందవచ్చు. చెవులను కుట్టడం వల్ల చిన్నప్పటి నుంచే మెదడు వికసిస్తుంది. తెలివి తేటలను ప్రదర్శిస్తారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. చదువుల్లో రాణిస్తారు. అలాగే పెద్దయ్యాక స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతాన లోపం సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు రావు.
చెవులను కుట్టించుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్‌గా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే బాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక చెవులను కుట్టించుకోవడం వల్ల కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. భవిష్యత్తులో కళ్లద్దాలను వాడాల్సిన అవసరం రాదు. అలాగే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు రావు. కనుక చెవులను కుట్టించుకోవడం అన్నదాన్ని ఆచారంగా కాక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే విషయంగా చూడాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.