Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Egg Manchurian : ఎగ్ మంచూరియాను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

D by D
January 20, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Egg Manchurian : మ‌న సాయంత్రం పూట ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ఎక్కువ‌గా ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఎగ్ మంచురియా ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది ఈ ఎగ్ మంచురియా. దీనిని అదే రుచితో మ‌పం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎగ్ మంచురియాను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. రుచిగా, సుల‌భంగా ఎగ్ మంచురియాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ మంచూరియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 4, కోడిగుడ్డు – 1, ఉప్పు – 2 చిటికెలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, మిరియాల పొడి – 2 చిటికెలు, మైదాపిండి – 3 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Egg Manchurian recipe in telugu how to make it
Egg Manchurian

టాసింగ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి త‌రుగు – 2 టీ స్పూన్స్, ప‌చ్చిమిర్చి త‌రుగు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చైనీస్ చిల్లీ పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పంచ‌దార – 2 చిటికెలు, ట‌మాట కిచ‌ప్ – ఒకటిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – అర టీ స్పూన్, అజిన‌మోటో – అర టీ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, నీళ్లు – 150 ఎమ్ ఎల్, స్ప్రింగ్ ఆనియ‌న్స్ – 2 టేబుల్ స్పూన్స్.

ఎగ్ మంచూరియా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్డును తీసుకోవాలి. త‌రువాత అందులో ఉప్పు, అల్లం పేస్ట్, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత కార్న్ ఫ్లోర్, మైదాపిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన కోడిగుడ్ల‌ను పొడుగ్గా నాలుగు ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌ట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్క‌ల‌ను ప‌చ్చ సొన చెదిరిపోకుండా కోడిగుడ్డు మిశ్ర‌మంలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌప్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత టాసింగ్ కోసం క‌ళాయిలో నూనె వేసి పెద్ద మంట‌పై వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక అల్లం తరుగు, వెల్లుల్లి త‌రుగు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత చిల్లీ సాస్, పంచ‌దార‌, ఉప్పు, మిరియాల పొడి, ట‌మాట కిచ‌ప్, అజిన‌మోటో, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి.

త‌రువాత వెనిగ‌ర్, సోయా సాస్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. నీళ్లు చిక్క‌బ‌డిన త‌రువాత వేయించిన ఎగ్ మంచూరియా, స్ప్రింగ్ ఆనియ‌న్స్ వేసి క‌ల‌పాలి. సాసెస్ అన్నీ మంచురియాకు ప‌ట్టేంత వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ మంచూరియా త‌యార‌వుతుంది. సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ గా ఇలా ఎగ్ మంచురియాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క‌టి కూడా విడిచి పెట్ట‌కుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు.

Tags: Egg Manchurian
Previous Post

Pimples : ఇలా చేస్తే మొటిమ‌లు అన్నీ మాయం అవుతాయి.. అద్భుతంగా పనిచేస్తుంది..

Next Post

Button Badusha : బాదుషాల‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Related Posts

హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025
వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.