Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Palakura Pappu : పాలకూర పప్పును రుచిగా ఇలా చేయండి.. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది..

D by D
February 11, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Palakura Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పాల‌కూర‌తో మ‌నం ఎక్కువ‌గా ప‌ప్పును త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. పాల‌కూర ప‌ప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ప‌ప్పు త‌యారీలో పులుపు కోసం మ‌నం చింత‌పండు ర‌సాన్ని ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం చింత‌పండే కాకుండా ఈ ప‌ప్పు త‌యారీలో పులుపు కొర‌కు మ‌నం మామిడికాయ‌ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. మామిడికాయ వేసి చేసే ఈ ప‌ప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తినేలా,తేలిక‌గా మామిడికాయ‌తో పాల‌కూర ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌కూర ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – 100 గ్రా., త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన పాల‌కూర – 5 క‌ట్ట‌లు, నీళ్లు – ఒక గ్లాస్, పుల్ల‌టి మామిడికాయ – 1 ( చిన్న‌ది), ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్.

Palakura Pappu recipe in telugu very easy to cook
Palakura Pappu

తాళింపు ప‌దార్థాలు..

నూనె – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, తాళింపు ప‌దార్థాలు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

పాల‌కూర ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, పాల‌కూర‌, నీళ్లు పోసి మూత పెట్టాలి. త‌రువాత ఈ ప‌ప్పును 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. అలాగే మామిడికాయ పై ఉండే చెక్కును తీసి ముక్క‌లుగా చేయాలి. ఈ ముక్క‌ల‌ను గిన్నెలో వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా ఉడికించాలి. త‌రువాత ముందుగా ఉడికించిన ప‌ప్పులో ఉప్పు, కారం, మ‌రో అర గ్లాస్ నీళ్లు, ప‌సుపు, ఉడికించిన మామిడికాయ గుజ్జును వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ ప‌ప్పును మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించుకోవాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత అందులో ముందుగా ఉడికించుకున్న ప‌ప్పును వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కూర ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చింత‌పండు ర‌సం వేసి చేసే మామిడికాయ ప‌ప్పు కంటే ఈ విధంగా మామిడికాయ వేసి చేసే పాల‌కూర ప‌ప్పు మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Palakura Pappu
Previous Post

Jajikaya : దీని గురించి తెలుసా.. కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది.. న‌రాల‌ను యాక్టివేట్ చేస్తుంది..

Next Post

Mustard Oil Cake For Hair : ఇది ఎక్క‌డ క‌పించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..

Related Posts

technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025
international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.