నేటి తరుణంలో యూజర్లకు లభిస్తున్న స్మార్ట్‌ఫోన్ల గురించి చెప్పాలంటే.. అబ్బో.. చాలా ఫీచర్లే వాటిల్లో ఉంటున్నాయి. ప్రస్తుతం ఫోన్ కొంటున్న వారు డిస్‌ప్లే మొదలుకొని బ్యాటరీ వరకు అన్ని ఫీచర్లను జాగ్రత్తగా చూసే ఫోన్ కొంటున్నారు. తెర సైజ్ ఎంత ఉంది, ర్యామ్ ఎంత, ప్రాసెసర్ ఎంత, కెమెరా సామర్థ్యం, స్టోరేజ్, 5జీ, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ కెపాసిటీ వంటి అనేక ఫీచర్లను చూసి ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే నిజానికి ఈ ఫీచర్లన్నీ చాలా వరకు స్మార్ట్ ఫోన్ యూజర్లకు తెలిసినవే. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్లలో చాలా మందికి తెలియని ఒక ఫీచర్ ఉంది. అదేమిటో తెలుసా..? కింద చూడండి..!
పైన ఇచ్చిన చిత్రంలో చూశారుగా, స్మార్ట్‌ఫోన్ పై భాగంలో ఓ చిన్న రంధ్రం ఉంది. నేడు మార్కెట్‌లోకి వస్తున్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్లకు ఇలాంటి రంధ్రం ఇస్తున్నారు. అయితే ఈ రంధ్రాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం. ఏమీ లేదండీ.. దాన్ని నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటారు.
సహజంగా మనకు ఫోన్ కింది భాగంలో స్పీకర్ పక్కనే ఓ మైక్ ఉంటుంది కదా. దాంతో మనం మాట్లాడేది అవతలి వ్యక్తులకు వినిపిస్తుంది. అయితే మనం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే వాతావరణంలో ఫోన్ కాల్స్ మాట్లాడం కదా, కొన్ని సార్లు శబ్దం ఎక్కువుండే ప్రదేశాల్లో, ట్రాఫిక్‌లో, థియేటర్లలో ఉన్నప్పుడు కూడా కాల్స్ మాట్లాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం మాట్లాడే మాటలు అవతలి వారికి సరిగ్గా వినిపించవు. అయితే పైన చెప్పిన నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ వల్ల మనం అలాంటి శబ్దం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కాల్స్ మాట్లాడేటప్పుడు మన చుట్టూ ఉండే శబ్దాలు అవతలి వ్యక్తులకు వినిపించకుండా సదరు మైక్ అడ్డుకుంటుంది. మనం కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్టూ వచ్చే శబ్దాలను ఆ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అడ్డుకోవడం వల్ల అవతలి వ్యక్తులకు మన వాయిస్ క్లియర్‌గా వినిపిస్తుంది. దీంతో వారు మన మాటలను సులభంగా వినగలుగుతారు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. తెలుసుకున్నారు కదా, ఆ రంధ్రం ఉపయోగం ఏంటో..! అయితే కొన్ని ఫోన్లకు పై భాగంలో కాకుండా వెనుక భాగంలో కెమెరా పక్కన, కొన్నింటికి సైడ్‌లలో ఇస్తున్నారు. కాబట్టి మీ ఫోనకు ఈ మైక్ ఎటువైపుందో ఒకసారి చూసుకోండి. ఈసారి కాల్ మాట్లాడేటప్పుడు ఆ మైక్ కు ఏదీ అడ్డం పెట్టకుండా మాట్లాడి చూడండి, మీ వాయిస్ అవతలి వ్యక్తులకు క్లియర్‌గా వినిపించకపోతే అప్పుడు చెప్పండి.