మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ పౌష్టికాహారం తీసుకోవాలి. సీజనల్‌గా లభించే పండ్లతోపాటు అన్ని సమయాల్లోనూ లభించే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారాలను తరచూ తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలోని పలు అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా అవయవాల సమస్యలతో బాధపడేవారు వాటికి సంబంధించిన ఆహారాలను తీసుకోడం వల్ల ఆయా సమస్యల నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఏయే అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. అవకాడోలు
ఇవి చూసేందుకు అచ్చం గర్భాశయాన్ని పోలి ఉంటాయి. అందువల్ల అవకాడోలను తీసుకుంటే మహిళలకు గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి. అవకాడోలను తినడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల గర్భాశయం, యోని గోడలు దృఢంగా మారుతాయి. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఆయా భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి.
2. క్యారెట్లు
క్యారెట్లను తినడం వల్ల విటమిన్ ఎ లభిస్తుందని, కంటి సమస్యలు పోతాయని, చూపు బాగా పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. క్యారెట్లలో ఉండే బీటా కెరోటీన్ కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తుంది. క్యారెట్లను అడ్డంగా చక్రాల మాదిరి కోసి చూడండి, కళ్లలాగే కనిపిస్తాయి కదా. కనుకనే ఇవి కళ్లకు మేలు చేస్తాయి. కంటి ఆరోగ్యానికి వీటిని ఎక్కువగా తీసుకోవాలి.
3. టమాటాలు
టమాటాలను నిలువుగా కోస్తే లోపలి భాగం అచ్చం మన గుండెలాగే ఉంటుంది. అందువల్ల టమాటాలు గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. టమాటాల్లో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని వల్ల టమాటాలకు ఎరుపు రంగు వస్తుంది. టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. హార్ట్ ఎటాక్‌లను రాకుండా చూస్తాయి.
4. నిమ్మజాతి పండ్లు
నిమ్మజాతికి చెందిన పండ్లను నిలువుగా కోసి చూడండి, అందులో లోపలి భాగం స్త్రీల స్తనాల్లోని లోపలి భాగాన్ని పోలి ఉంటుంది. అందువల్ల నిమ్మజాతి పండ్లు స్తనాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి వంటి పండ్లను తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నిరోధించ వచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. నిమ్మజాతికి చెందిన పండ్లలో విటమిన్ సి, ఫోలేట్, కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. అందువల్లే బ్రెస్ట్ క్యాన్సర్ రాదు.
5. ద్రాక్ష
ద్రాక్ష పండ్ల గుత్తిని చూస్తే ఏం గుర్తుకు వస్తుంది ? అది అచ్చం ఊపిరితిత్తుల్లోని బుడగల మాదిరిగా ఉంటుంది. అందువల్ల ద్రాక్షలను తింటే ఊపిరితిత్తులకు మేలు జరుగుతుంది. ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఆంథో సయనిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు మ్యూకస్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. వాపులు తగ్గుతాయి. ఊపిరితిత్తుల సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ద్రాక్షలను తింటే మంచిది. ఆయా సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు.
6. వాల్‌నట్స్
వాల్ నట్స్ చూసేందుకు అచ్చం మెదడు ఆకారంలోనే ఉంటాయి. అందువల్ల వీటిని తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. వాల్ నట్స్‌లో విటమిన్ ఇ, ఫోలేట్, మెలటోనిన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. మెదడును సంరక్షిస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అందువల్ల తరచూ వాల్‌నట్స్‌ను తినాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365